TKS: హోరాహోరీగా ఒమాన్ టి.కె.యస్ ఎన్నికలు!
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:41 PM
అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఒమాన్‌లోని ప్రవాసీ తెలుగు సంఘమైన తెలుగు కళా సమితి ఎన్నికలలో మునుపటి కార్యవర్గం మళ్లీ విజయం సాధించింది.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఒమాన్‌లోని ప్రవాసీ తెలుగు సంఘమైన తెలుగు కళా సమితి ఎన్నికలలో మళ్ళీ విజయకేతనం ఎగురవేయడం ద్వారా మునుపటి సభ్యులు తమ సత్తాను మరోసారి నిరూపించుకున్నారు (NRI).
సుమారు రెండు వారాల హోరాహోరీ ప్రచారం, సామాజిక సమీకరణలు, వర్గాల ఆధిపత్యం, వ్యక్తుల కుమ్ములాటల అనంతరం శుక్రవారం జరిగిన ఎన్నికలలో తెలుగు ఓటర్లు తెలివిగా తీర్పును వెలువరించారు. భారతీయ ఎంబసీ ఆధ్వర్యంలో పని చేసే తెలుగు కళా సమితికి ప్రస్తుతం ప్రవాసాంధ్ర ప్రముఖులలో ఒకరైన విశాఖపట్టణం గాజువాకకు చెందిన కొత్తూరు చిన్నారావు అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆయనతో పాటు ఆయన బలపర్చిన అత్యధికులు మరోసారి ఎన్నికయ్యారు.
Kuwait: కువైత్‌లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్!
చిన్నారావును మరోసారి ఎన్నుకోవడంతో పాటు ఆయన బలపర్చిన వారిని ఎన్నుకున్నారు. మెత్తం తొమ్మిది మందిలో ఏడుగురు ఆయన బలపర్చిన బృందం నుండి ఎన్నిక కాగా మరో ఇద్దరిలో ఒకరు ఇటీవలి వరకు ఆయన వర్గంలో కొనసాగారు. మరొకరు మాత్రం సామాజిక న్యాయం పేర హోరాహోరీ పోరాటం చేసి గెలిచినప్పటికీ అధిక్యత ఓట్లు పొందిన మొదటి అయిదుగురిలో స్థానం పొందలేకపోవడం గమనార్హం.
అనిల్ కుమార్ నగిడి, అరుణ్ కుమార్ సాదు, చైతన్యకుమార్ కటికల, జగ్నాథ మణి పెరీ, పవన్ కుమార్ వేములపల్లి, సీతరాం శాఖమూరి, రాజశేఖర్ సురపన్నేని మరియు నాగారాణి వేములలు ఎన్నికయ్యారు.
Oman: గల్ఫ్ ఎడారి ఒయాసిస్‌లో వేములవాడ రాజన్న కళ్యాణోత్సవం
అందరు కలిసి చర్చించుకోవడం ద్వారా పరస్పరంగా అందరికీ సానుకూలంగా పదవుల పందేరానికి అవకాశం ఉన్నప్పటికీ వ్యక్తిగత భేషజాలకు వెళ్ళి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహారించడంతో ఎన్నికల వేడెక్కి తెలుగు సమాజం విడిపోయినట్లుగా కనిపించినా ఫలితాలు మాత్రం భిన్నంగా ఐక్యతా రాగం దిశగా వచ్చాయి.
ఎన్నికలలో ప్రచారం నుంచి ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన సంబరాల వరకు ఉత్తరాంధ్ర ప్రవాసీయులు కీలక పాత్ర వహించారు.
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎన్నారై ప్రముఖుడు