Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎన్నారై ప్రముఖుడు
ABN , Publish Date - Feb 06 , 2025 | 09:16 PM
ఏపీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబును ప్రవాసాంధ్రులు ప్రశంసించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విధ్వంసమైన స్వరాష్ట్రం పునర్నిర్మాణంలో ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రవాసాంధ్రులు కొనియాడారు (NRI).
సౌదీ అరేబియాలోని రియాధ్ నగర ప్రవాసీ ప్రముఖుడు, పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన జానీ బాషా గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి రాష్ట్ర పునర్నిర్మాణానికి చేస్తున్న కృషి పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు ఆయన ప్రవాసాంధ్ర వ్యవహారాల శాఖ మంత్రి కె. శ్రీనివాస్‌తో కూడా సమావేశమయ్యారు. సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్రుల సాధకబాధకాల గురించి చర్చించారు.
స్వస్థలంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే జానీ బాషా సౌదీలోని ప్రముఖ ప్రవాసీ సంఘమైన సాటా సెంట్రల్‌లో కూడా రాజకీయాలకు అతీతంగా ప్రముఖపాత్ర వహిస్తున్నారు.
SATA: సౌదీలో ఇద్దరు ఆంధ్రులను ఆదుకున్న మానవతామూర్తులు