Share News

Kuwait: కువైత్‌లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్!

ABN , Publish Date - Feb 14 , 2025 | 05:58 PM

యువత క్రీడల్లో పాల్గొనాలి.. తద్వారా వారి ఆరోగ్యం మెరుగుపరచుకోవాలి అనే లక్ష్యంతో కువైత్‌లో యూటీఎఫ్ తాజాగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసింది.

Kuwait: కువైత్‌లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్!

యువత క్రీడల్లో పాల్గొనాలి.. తద్వారా వారి ఆరోగ్యం మెరుగుపరచుకోవాలి అనే లక్ష్యంతో కువైత్‌లో యూటీఎఫ్ తాజాగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసింది. గతంలో కూడా యూటీఎఫ్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు, సమాజ హితం కోసం చాలా కార్యక్రమాలను సంస్థ అధ్యక్షులు వెంకట్ కోడూరి చేశారు.

నూతన సంవత్సరం జనవరి 1న ప్రారంభం అయిన మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 14వ తేదిన స్థానిక జాబర్ అహ్మద్ ప్రాంతంలోని సుధా లయన్ గ్రౌండ్‌లో స్థానిక కాలమానం ప్రకారం 7 గంటలకు రెడ్డి రైడర్స్, ఏపీ ఎలెవన్ జట్ల మధ్య జరిగింది. హోరాహోరిగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఏపీ ఎలెవన్ జట్టు విజేతగా నిలిచింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ భారత క్రికెటర్ వెంకటపతి రాజు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు (NRI).

1.jpg


Oman: గల్ఫ్ ఎడారి ఒయాసిస్‌లో వేములవాడ రాజన్న కళ్యాణోత్సవం

వేంకటపతి రాజు ఇండియా టీంకు విశేష సేవలు అందించారు. ఆయన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ న్యూజిలాండ్ టూర్‌తో 1990లో మొదలు అయ్యింది. స్పిన్ దిగ్గజాల్లో రాజు ఒకరు. అప్పటి సహచరులు అనిల్ కుంబ్లే, రాజేష్ చౌహాన్ లతో కలిసి ప్రత్యర్థి టీంకు చుక్కలు చూపించేవారు. తన బంతిని తిప్పినట్టు ప్రత్యర్థి టీం వారినీ ఒక్కొక్కరిని తన స్పిన్ మాయాజాలంతో పెవిలియన్‌కు పంపేవారు. వెంకటపతి రాజు మొత్తం28 టెస్ట్ మ్యాచ్‌ల్లో 93 వికెట్‌లు తీశారు. 53 వన్డే మ్యాచ్‌ల్లో 63 వికెట్‌లు తీశారు. ఈడెన్ గార్డెన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్‌లు తీసి తన ప్రతాపం చూపించారు. అదే విధంగా శ్రీలంకతో బెంగుళూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 32 ఓవర్లు వేసి కేవలం 40 పరుగులిచ్చి 8 వికెట్‌లు తీసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. స్పిన్ విభాగంలో తనదైన ముద్ర వేసిన వెంకటపతి రాజు యూటీఎఫ్ ఆహ్వానం మేరకు కువైత్‌కు రావడం, అదీ ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు గల్ఫ్‌లో జరిగే పోటీలకు రావడం, వారిని ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత యూటీఎఫ్ అధ్యక్షులు వెంకట్ కోడూరికి దక్కింది. వెంకటపతి రాజు రిటైర్మెంట్ తరువాత భారత్ టీం సెలెక్టర్‌గా, కోచ్‌గా, అనలిస్ట్‌గా వివిధ సేవలు భారత్ టీంకు అందిస్తున్నారు.

2.jpg


Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎన్నారై ప్రముఖుడు

ఈ సందర్భంగా వెంకటపతి రాజు యూటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ క్రీడలు ఎంతో అవసరమని, ఇలాంటి పోటీలు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇంకా జరగాలని అన్నారు. యూటీఎఫ్‌కు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కువైత్‌లో ఉన్న వారు సహకరించాలని కోరారు. తనకు చాలా సంతోషంగా ఉందని, తెలుగువారు అన్ని రంగాల్లో ముందు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు సహకరించిన ప్రతి ఒక్కరినీ మెమెంటోలు ఇచ్చి సత్కరించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ,ఉత్తమ బౌలర్, ఉత్తమ బ్యాటింగ్ లాంటి బహుమతులను కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్న యూటీఎఫ్‌కు, స్పాన్సర్‌లకు వెంకటపతి రాజు ధన్యవాదాలు తెలిపారు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కూడా టోర్నమెంట్ జరిపించాలని, ఇంకా ఎక్కువ జట్లు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాలని, దానికి కావాల్సిన సహకారం తాను అందిస్తానని అన్నారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన యూటీఎఫ్ అధ్యక్షులు వెంకట్ కోడూరి.. వారికి మెమెంటో లు ఇచ్చి సత్కరించారు.

4.jpg

Read Latest and NRI News

Updated Date - Feb 15 , 2025 | 11:20 AM