Share News

Important Parenting Tips: పిల్లల విషయంలో జాగ్రత్త

ABN , Publish Date - Oct 22 , 2025 | 05:55 AM

నేటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలపై రకరకాల ఆశలు పెట్టుకుంటున్నారు. వాటిని సాధించి తీరాలంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనివల్ల పిల్లల మానసిక స్థితి...

Important Parenting Tips: పిల్లల విషయంలో జాగ్రత్త

నేటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలపై రకరకాల ఆశలు పెట్టుకుంటున్నారు. వాటిని సాధించి తీరాలంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనివల్ల పిల్లల మానసిక స్థితి ప్రభావితమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలను పెంచే క్రమంలో తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...

  • పిల్లలందరి శక్తి సామర్థ్యాలు, ఆలోచన తీరు ఒకేరకంగా ఉండవు. కాబట్టి పిల్లలను ఇతరులతో పోల్చకుండా వారి నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి. అవసరమైన శిక్షణ ఇప్పించాలి.

  • క్రమశిక్షణ పేరుతో పిల్లలకు కఠినమైన ఆంక్షలు పెట్టకూడదు. కేవలం చదువుకు మాత్రమే ప్రాముఖ్యమిస్తే పిల్లలు ఆటపాటల్లో రాణించలేరు. అంతేకాదు వాళ్లకు.. ఇతరులతో మాట్లాడే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, పోటీ తత్త్వం అలవడవు.

  • పిల్లలు ఏవైనా పొరబాట్లు చేస్తే వారిపై కోపం చూపించకూడదు. సామరస్యంగా వ్యవహరించి మంచి, చెడుల తారతమ్యాన్ని వివరించాలి.

  • పరీక్షల్లో మార్కులు తగ్గాయనో, ఆటల్లో ఓడిపోయారనో పిల్లలను ‘నీకేమీ చేతకాదు’ అంటూ నిరాశ పరచకూడదు. దీనివల్ల పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మరో ప్రయత్నం చేసి అనుకున్నది సాధించేలా పిల్లలను ప్రోత్సహించాలి.

  • పిల్లల ఇష్టాలు, ఆశయాలు తెలుసుకోకుండా చెప్పిన మాట వినాలంటూ ఒత్తిడి చేయకూడదు. పిల్లలు ఏవిధంగా ఆలోచిస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. పిల్లల అభిరుచులను గమనిస్తూ ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి.

  • పిల్లల మీద అతిగా ప్రేమ చూపిస్తూ వాళ్లు ఏమి చేసినా సమర్థించడం కూడా మంచిది కాదు. పిల్లలకు సమయపాలన, తోటివారితో స్నేహంగా ఉండడం, పెద్దలతో మర్యాదగా మెలగడం, సమయస్ఫూర్తి నేర్పించాలి. పోషకాహారం, వ్యాయామం, వ్యక్తిగత శుభ్రతల గురించి తెలియజెప్పాలి.

ఇవి కూడా చదవండి:

12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 05:55 AM