Zubeen Garg: జుబిన్ గార్గ్ డెత్ మిస్టరీ.. ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది అరెస్ట్
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:58 PM
ఇటీవల సింగపూర్‌లో అనుమానాస్పదంగా మరణించిన అస్సాం గాయకుడు జుబిన్ గార్గ్ డెత్ కేసు ఇవాళ మరో మలుపు తీసుకుంది. జుబిన్ గార్గ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దర్ని సిట్ బృందం అరెస్ట్ చేసింది.
గువహతి(అస్సాం)అక్టోబర్ 10: ఇటీవల సింగపూర్‌లో అనుమానాస్పదంగా మరణించిన అస్సాం గాయకుడు జుబిన్ గార్గ్ డెత్ కేసు ఇవాళ మరో మలుపు తీసుకుంది. జుబిన్ గార్గ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దర్ని సిట్ బృందం అరెస్ట్ చేసింది. నందీశ్వర్ బోరా, పరేష్ బైశ్యా అనే వీరిని ప్రశ్నించిన అనంతరం సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. వీరిరువురి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
జుబిన్ గార్గ్ పర్సనల్ సెక్కూరిటీ గార్డులైన నందీశ్వర్ బోరా, పరేష్ బైశ్యా ఖాతాల్లో ఇటీవల దాదాపు రూ.కోటి మేర లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో గార్గ్ మరణంలో వీరి ప్రమేయం ఉందనే అనుమానంతో విచారించి అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల సింగపూర్ వెళ్లిన గాయకుడు జుబిన్ అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంపై ఆయన భార్య సహా పలువురు కుట్ర కోణం దాగుందని ఆరోపించడంతో ఈ కేసు సంచలనంగా మారింది. అటు, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం జుబిన్ మృతిపై విచారణ ముమ్మరం చేసింది.
జుబిన్ మృతి చెందిన సమయంలో డెత్ స్పాట్‌లో ఉన్న వారిపై సిట్ అధికారులు నిఘా పెట్టారు. ఇప్పటికే జుబిన్ మేనేజర్ అయిన సిద్ధార్థశర్మ, నార్త్‌ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్‌కాను మహంత, జుబిన్ కజిన్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..
Read Latest AP News And Telugu News