Srinagar: ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి నదిలో దూకి మృతి
ABN , Publish Date - May 06 , 2025 | 04:48 AM
శ్రీనగర్‌లో ఉగ్రవాదులకు సహకరించిన ఆరోపణలతో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే యువకుడు నదిలో దూకి మృతిచెందాడు. ఇది అనుకోకుండా జరిగిందని పోలీసులు చెబుతున్నప్పటికీ, కుట్రపూరిత కస్టడీలో హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు
పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో ఘటన
కావాలని చేసినదేనని కుటుంబ సభ్యుల ఆరోపణ
శ్రీనగర్, మే 5: పహల్గాంలో దారుణానికి పాల్పడ్డ ఉగ్రవాదులకు సహాయం అందించాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే(23) ఆదివారం వెష్వ్ నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. విచారణ నుంచి తప్పించుకునే క్రమంలో మరణించినట్టు భద్రత బలగాలు చెబుతుండగా, పోలీసులే కావాలని ఈ పని చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉగ్రవాదుల రహస్య స్థావరాలను చూపిస్తానంటూ తొలుత అతడు పోలీసులు, భద్రత బలగాలకు చెప్పాడు. పోలీసులు డ్రోన్ కెమేరా, ఇతర సామగ్రిని తీసుకొని అతడి వెంట వెళ్లారు. నదికి సమీపంలో ఓ స్థావరం ఉందని చెప్పి జవాన్లను అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకోగానే వారి నుంచి నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకాడు.
నదిలో ఈత కొట్టి బయటపడేందుకు ప్రయత్నించినా నీటి ప్రవాహ వేగం బలంగా ఉండడంతో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన డ్రోన్ వీడియో వైరల్‌గా మారింది. కొన్ని గంటల తరువాత అతడి శవం కుల్గాం జిల్లాలోని అహర్‌బల్ ప్రాంతంలో ఉన్న అబ్దల్ వాగులో దొరికింది. కుటుంబ సభ్యులు మాత్రం దీనితో ఏకీభవించడంలేదు. విచారణ నిమిత్తం శనివారం అతడిని పోలీసులు తీసుకెళ్లారని తెలిపారు. ఇది కస్టోడియల్ మరణమేనని, దీనిపై దర్యాప్తు చేయించాలని డిమాండు చేశారు. ఉగ్రవాదులకు సహకరించినట్టు మాగ్రే విచారణలో అంగీకరించాడని తెలిసింది. కుల్గాంలోని తంగ్‌మార్గ్ అడవిలో దాక్కొన్న ఉగ్రవాదులకు ఆహారం, ప్రయాణ సౌకర్యాలు కల్పించినట్టు చెప్పాడని సమాచారం. మాగ్రే మరణం కుట్ర అని మాజీ సీఎం ముఫ్తీ ఆరోపించారు.
Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..