India-US Trade Talks : భారత్-అమెరికా టారిఫ్ చర్చలు త్వరలో తిరిగి ప్రారంభం
ABN , Publish Date - Sep 10 , 2025 | 02:55 PM
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆరవ రౌండ్ చర్చలు త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చలు ఆగస్టు చివరి వారంలో జరగాల్సి ఉండగా, డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై 50 శాతం సుంకం విధించిన తర్వాత ఇవి నిరవధికంగా వాయిదా పడ్డాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆరవ రౌండ్ చర్చలు త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చలు ఆగస్టు చివరి వారంలో జరగాల్సి ఉండగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై 50 శాతం సుంకం విధించిన తర్వాత ఈ చర్చలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈ చర్చలు తిరిగి మొదలవ్వబోతున్నాయి.
భారత్, అమెరికా ట్రేడ్ టారిఫ్ చర్చలు పునఃప్రారంభమవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ధృవీకరించారు. రెండు దేశాల 'వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగిస్తున్నాయి' అని ట్రంప్ తెలిపారు.
'రాబోయే కొన్ని వారాల్లో నా మంచి స్నేహితుడు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటానికి నేను ఎదురు చూస్తున్నాను. మన రెండు గొప్ప దేశాలకు విజయవంతమైన ముగింపుకు రావడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని నేను కచ్చితంగా భావిస్తున్నాను!' అని ఆయన ట్రంప్ ఉద్ఘాటించారు. అయితే, ట్రంప్ సందేశంతో భారత ప్రధాని నరేంద్రమోదీ సానుకూల దృక్పదాన్ని కనబర్చారు. భారత్, అమెరికా ట్రేడ్ టారిఫ్ చర్చలు ఫలప్రదం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో ట్రంప్ కు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
ఇలా ఉండగా, అమెరికాకు చెందిన వ్యవసాయ, పాడి పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు భారత మార్కెట్లలోకి అనుమతివ్వాలని ట్రంప్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ అంశంపై తన వైఖరికి కట్టుబడి ఉండాలని భారత్ భావిస్తోంది. చౌకైన అమెరికన్ వస్తువులు భారత మార్కెట్లలోకి ప్రవేశిస్తే, ఇక్కడి రైతులు, ఆయా పరిశ్రమలు నీరుగారిపోయే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. దేశంలో కోట్లాది మంది రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారులు, ఇంకా మహిళల జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని భావిస్తున్న భారత్ ట్రంప్ డిమాండ్ కు తలొగ్గడంలేదు. దేశంలో ఎక్కువ మందికి ఈ ఉత్పత్తులే జీవనాధారం కావడంతో భారత్ సర్కారు ఈ అంశంపై అమెరికాకు తలొగ్గకూడదని గట్టి పట్టుదలతో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చివేత
Read Latest Telangana News and National News