AP News: రాష్ట్రంలో చంద్రన్నతోనే అభివృద్ధి సాధ్యం..
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:31 PM
సీఎం చంద్రబాబునాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. మంగళవారం బాలాజీనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో రొళ్ల మండలం అవినకుంట, జీజీహట్టి, దొడ్డేరి గ్రామాలకు చెందిన 20 కుంటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
- టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి
మడకశిర(అనంతపురం): సీఎం చంద్రబాబునాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. మంగళవారం బాలాజీనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో రొళ్ల మండలం అవినకుంట, జీజీహట్టి, దొడ్డేరి గ్రామాలకు చెందిన 20 కుంటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
గుండుమలతిప్పేస్వామి, కురుబ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ దేవేంద్రప్ప సమక్షంలో వారు పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని పనులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అనేక మంది టీడీపీలోకి రావడానికి మొగ్గు చూపుతున్నారన్నారు. అవినకుంట, జీజీ హట్టి, దొడ్డేరి గ్రామాలకు చెందిన వెంకటప్ప, సిద్దప్ప, ఉమేష్ తోపాటు 20కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, లక్ష్మీనారాయణ, నరసింహరాజు, భక్తర్, కన్వీనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చివేత
Read Latest Telangana News and National News