Saurabh Sharma: కారులో కట్టలు.. లెక్క పెట్టడానికే..
ABN , Publish Date - Jan 16 , 2025 | 08:02 PM
Saurabh Sharma: తండ్రి మరణించడంతో.. కారుణ్య నియామకం కింద ఆర్టీవో కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందాడు. ఆ ఉద్యోగాన్ని కూడా జస్ట్ ఎనిమిదేళ్లు చేశాడు. అంతే

న్యూఢిల్లీ, జనవరి 16: ఉత్తరప్రదేశ్‌లోని కోశంబి జిల్లాలో ఎన్నో నేరాలు చేసిన గ్యాంగ్‌స్టర్ నక్దు యాదవ్.. తన పేరును నందలాల్ యాదవ్‌గా మార్చుకొని నకిలీ పత్రాలు సృష్టించుకొని పోలీస్ శాఖలో దాదాపు 35 ఏళ్ల పాటు హోం గార్డ్‌గా విధులు నిర్వహించాడు. అతడి బండారం కాస్తా ఇటీవల బహిర్గతమైంది. దీంతో ప్రజలే కాదు.. పోలీస్ శాఖ సైతం ముక్కున వేలేసుకొంది. తాజాగా మరో ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఆర్టీవో కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన సౌరభ్ శర్మ వందల కోట్ల ఆస్తులు చూసి.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో సైతం అలజడి మొదలైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. భోపాల్ నగర శివారులోని మెండోరి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్.. తన పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఇంతలో ఆ సమీపంలో ఇన్నోవా కారును పార్క్ చేసి.. అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగారు. అయితే వారు కారు నెంబర్ ప్లేట్ తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో మాజీ సర్పంచ్‌కు కాస్తా ఆసక్తి కలింది. కొన్ని రోజులుగా ఆ కారు అక్కడ ఉంది. దీనిని తీసుకు వెళ్లేందుకు ఎవరు రాలేదు. కారు సమీపంలోని వెళ్లి చూస్తే.. కారు ప్లేట్ మీద ఆర్‌టీవో అని రాసి ఉంది.
కారు అద్దాల్లో నుంచి లోపలికి చూశాడు. అందులో భారీ ఎత్తున బ్యాగులు ఉన్నట్లు గుర్తించాడు. దీంతో స్థానిక రాతిబాది పోలీస్ స్టేషన్‌కు ఫోన్‌లో సమాచారం అందించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన కారు వద్దకు వచ్చి పరిశీలించారు. ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందించారు. వారి సమక్షంలో కారు అద్దాలు పగల కొట్టగా.. అందులో భారీగా నగదు, కిలోల కొద్ది బంగారాన్ని ఉన్నట్లు గుర్తించారు. వాటిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కారు ఆర్టీవో కార్యాలయంలో విధులు నిర్వహించిన సౌరభ్ శర్మదిగా గుర్తించారు. దీంతో అతడి నివాసంపై లోకాయుక్త పోలీసులు, ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేసి కోట్లాది రూపాయిలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: సైఫ్ నివాసంలోకి దొంగ ఎలా ప్రవేశించాడంటే..?
అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న కారు సౌరభ్ శర్మ స్నేహితుడి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఇక సౌరభ్ శర్మతోపాటు అతడి స్నేహితులు సైతం పరారీలో ఉన్నట్లు గమనించారు. మరోవైపు సౌరభ్ తండ్రి ప్రభుత్వ వైద్యుడిగా విధులు నిర్వర్తించే వారు. ఆయన ఉద్యోగంలో ఉండగానే మరణించారు. దీంతో కారుణ్య నియామకం కింద 2015లో ఆర్టీవో కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సౌరభ్ శర్మకు ప్రభుత్వం మంజూరు చేసింది.
Also Read : మళ్లీ అగ్ని ప్రమాదం.. రూ. కోటి విలువైన పత్తి దగ్ధం
Also Read : ఎల్‌ఐసీ పాలసీ చేసి మర్చిపోయారా? ఇదిగో ఇలా క్లైయిమ్ చేసుకోవచ్చు..
2015లో అతడు వీఆర్ఎస్ తీసుకున్నాడు. తనకున్న పరిచయాలతో అతడు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టాడు. ఈ నగదంతా సౌరభ్ శర్మతోపాటు అతడి స్నేహితులు హవాలా మార్గంలో సంపాదించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇంకోవైపు సౌరభ్ శర్మకు చెందిన ఓ డైరీని ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : సైఫ్‌పై దాడి చేసిన దుండగుడి ఫొటో విడుదల చేసిన పోలీసులు
Also Read: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. ఆందోళనలో కరీనా కపూర్
ఈ డైరీలో పలువురు రాజకీయ ప్రముఖల పేర్లు సైతం ఉండడంతో.. రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేగింది. ఆ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి. అయితే మాజీ సర్చంచ్ ఈ కారును 2024, డిసెంబర్ 19న గుర్తించాడు. నాటి నుంచి మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఆలజడి ప్రారంభమైంది.
For National News And Telugu News