MK Stalin: రూ.10,000 కోట్లు ఇచ్చినా ఎన్ఈపీకి నో ఎంట్రీ: స్టాలిన్
ABN , Publish Date - Feb 22 , 2025 | 08:22 PM
వైద్య విద్యార్థులకు 'నీట్' టెస్ట్ మాదిరిగానే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో అడ్మిషన్లకు కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని, ఎన్‌ఈపీని అనుమతిస్తే విద్యార్థులు మధ్యలోనే తమ చదువులకు స్వస్తి చెబుతారని సీఎం స్టాలిన్ అన్నారు.
కడలూరు: జాతీయ విద్యా విధానం (NEP)పై కేంద్రం ప్రభుత్వంపై మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK Stalin) విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం రూ.10,000 కోట్ల నిధులు ఇచ్చినా ఎన్‌ఈపీ అమలును అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేవలం హిందీని బలవంతంగా రుద్దడం వల్ల ఎన్‌ఈపీని వ్యతిరేకించడం లేదని, ఇతర కారణాలు కూడా చాలానే ఉన్నాయని అన్నారు. ఎన్ఈపీని అమలు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు, సామాజిక న్యాయ వ్యవస్థ తీవ్ర పరిమాణాలను ఎదుర్కొంటుందని అన్నారు.
Shaktikanta Das: మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా శక్తికాంత దాస్
వైద్య విద్యార్థులకు 'నీట్' టెస్ట్ మాదిరిగానే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో అడ్మిషన్లకు కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని, ఎన్‌ఈపీని అనుమతిస్తే విద్యార్థులు మధ్యలోనే తమ చదువులకు స్వస్తి చెబుతారని అన్నారు. విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పడమంటే వారిని చదువుకు దూరం చేయడమేనని శనివారంనాడిక్కడ పేరెంట్స్-టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిని కార్యక్రమంలో మాట్లాడుతూ స్టాలిన్ అన్నారు.
భాషను వ్యతిరేకించడం లేదు..
తాము ఏ భాషనూ వ్యతిరేకించడం లేదని, బలవంతంగా భాషను రుద్దడాన్నే తాము వ్యతిరేకిస్తు్న్నామని సీఎం చెప్పారు. కేవలం హిందీ వ్యతిరేకత వల్ల ఎన్‌ఈపీ ప్రయత్నాన్ని తాము అడ్డుకోవడం లేదని, జాతీయ విద్యావిధానం తిరోగమన ఫలితాలను ఇస్తుందని, ఇది విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ విద్యార్థులకు ఇప్పుడిస్తు్న్న ఆర్థిక సాయాన్ని తోసిపుచ్చడంతో పాటు, 3,5,8వ తరగతులకు కూడా పబ్లిక్ ఎగ్జామ్స్‌ను ఎన్‌ఈపీ ప్రతిపాదిస్తోందన్నారు. వీటికితోడు ఆర్ట్స్, సైన్స్ కాలేజీల్లోనూ అడ్మిషన్ల కోసం కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను ప్రవేశపెడుతోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.