Share News

Uttar Pradesh: భర్తను చంపి పాము కాటు అని నమ్మించి

ABN , Publish Date - Apr 18 , 2025 | 03:18 AM

భర్తను ప్రేమికుడితో కలిసి హత్య చేసిన భార్య, పాము కాటు కథతో మోసం చేయబోయిన ఘటన యూపీ మేర్‌ట్లో కలకలం రేపింది పోస్టుమార్టం నివేదికతో అసలు నిజం వెలుగులోకి వచ్చి, ఇద్దరూ పోలీసులకు దొరికిపోయారు

Uttar Pradesh: భర్తను చంపి పాము కాటు అని నమ్మించి

  • ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం

  • గొంతు పిసికి చంపారని తేల్చిన పోస్టుమార్టం నివేదిక

మీరట్‌, ఏప్రిల్‌ 17: యూపీలోని మేరఠ్‌లో మరో ఘోరం వెలుగుచూసింది. ఇటీవల నేవీ అధికారి, 29 ఏళ్ల సౌరభ్‌ రాజ్‌పుత్‌ను అతడి భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్యచేసి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. ఆ అవశేషాలను ఒక ప్లాస్టిక్‌ డ్రమ్‌లో ఉంచి పైనుంచి సిమెంట్‌తో కప్పిపెట్టిన ఘటన తరహాలోనే మరో నేరం జరిగింది. 25 ఏళ్ల అమిత్‌ కశ్యప్‌ అనే యువకుడిని అతడి భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్‌దీప్‌ కలిసి గొంతు పిసికి చంపారు. హత్యానేరం నుంచి బయటపడేందుకు రవిత పెద్ద ప్రణాళికే వేసింది. తన భర్త పాము కాటుకు గురై మరణించాడని లోకాన్ని నమ్మించేందుకు వెయ్యి రూపాయలు పెట్టి ఓ పామును కొనుగోలు చేసింది. హత్యచేసిన తర్వాత రాత్రి అతడి దుస్తుల్లోకి పామును వదిలింది. మరుసటి రోజు పాము కాటుతోనే తన భర్త చనిపోయాడంటూ చుట్టుపక్కల వారి ఎదుట గగ్గోలు పెట్టింది. మృతదేహంపై పదిచోట్ల పాము కాట్లు కనిపించడంతో తొలుత ఎవ్వరికీ అనుమానం కలగలేదు. అయితే పోస్టుమార్టం నివేదిక.. అమిత్‌ను గొంతు నులిమి చంపారంటూ తేల్చడంతో రవిత, ఆమె అమర్‌దీప్‌ నేరం అంగీకరించక తప్పలేదు. వాస్తవానికి అమిత్‌, అమర్‌దీప్‌ స్నేహితులు. ఈ స్నేహంనెపంతోనే తరచూ అమిత్‌ ఇంటికొచ్చే అమర్‌దీప్‌, అతడి భార్య రవితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది అమిత్‌కు తెలియడంతో అతడికి, రవితకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్తను హత్యచేసినా. నేరం మాత్రం తనపై పడకూడదనే ప్రణాళికతో రవిత వ్యవహరించినా ఆమెతో పాటు ప్రియుడు పోలీసులకు దొరికిపోక తప్పలేదు.


ఈ వార్తలు కూడా చదవండి

తరగతి గదిలో పెచ్చులూడి పడి..

ప్రైవేట్‌ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది

దుబాయిలో అసలేం జరిగింది..?

తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2025 | 03:18 AM