Wife Suicide: భర్త చీర కొనివ్వలేదని.. భార్య సూసైడ్
ABN , Publish Date - Oct 10 , 2025 | 06:31 PM
యూపీలోని లఖీంపూర్ ఖేరీ జిల్లా బిరుమై గ్రామానికి చెందిన బాబ్లీ అనే వివాహిత సూసైడ్ చేసుకుంది. దాదాపు 10 నెలల క్రితం ధర్మ్‌పాల్ అనే వ్యక్తితో బాబ్లీకి వివాహం జరిగింది. కొద్దీ రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో అనుకోని ఘటన జరిగింది. తనకు ఒక చీర కావాలని బాబ్లీ కట్టుకున్న తన భర్తను అడిగింది. అయితే పొలం పనుల్లో చేసే ధర్మ్‌పాల్.. వరికోత అయ్యాక చేస్తానని తన భార్యకు నచ్చజెప్పి పనులకు వెళ్ళిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
యూపీ, అక్టోబర్ 10: ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే పెళ్లి చేసుకున్న జంటలు విడిపోతున్నారు. ప్రేమ పెళ్లి అయినా పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా కొద్ది రోజులు గడిచాక మనస్పర్థల కారణంగా ఒకరికొకరు దూరం అవుతున్నారు. సినిమాకు తీసుకువెళ్లలేదని, మేకప్ కిట్ కొనివ్వలేదని, తనను బయటకు తీసుకెళ్లలేదని, తనతో టైం స్పెండ్ చేయట్లేదని ఇలా లోలోపలే బాధపడుతూ బంధాలను దూరం చేసుకుంటున్నారు. జీవితాంతం తోడునీడగా బతకాల్సిన జంట చిన్న కష్టం ఎదురవగానే.. తట్టుకోలేక భార్య భర్తలు ఒకరికొకరు దూరం అవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
యూపీలోని లఖీంపూర్ ఖేరీ జిల్లా బిరుమై గ్రామానికి చెందిన బాబ్లీ అనే వివాహిత సూసైడ్ చేసుకుంది. దాదాపు 10 నెలల క్రితం ధర్మ్‌పాల్ అనే వ్యక్తితో బాబ్లీకి వివాహం జరిగింది. కొద్దీ రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో అనుకోని ఘటన జరిగింది. తనకు ఒక చీర కావాలని బాబ్లీ కట్టుకున్న తన భర్తను అడిగింది. అయితే పొలం పనుల్లో చేసే ధర్మ్‌పాల్.. వరికోత అయ్యాక చేస్తానని తన భార్యకు నచ్చజెప్పి పనులకు వెళ్ళిపోయాడు. అడిగిన వెంటనే భర్త చీర కొనివ్వలేదని తీవ్ర మనస్తాపానికి గురైన బాబ్లీ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది.
తల్లి విమల, కుటుంబ సభ్యులు వచ్చి చూసే సరికి డోర్ వేసి ఉంది. లోపల ఎవరున్నారు అని డోర్ తట్టగా.. ఎంతకీ తెరువక పోవడంతో కిటికీ నుంచి చూశారు. ఆమె ఉరి వేసుకున్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు.. తలపులు బద్దలు కొట్టి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆమెను షాజహాన్‌పూర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చివరి వరకు చావుతో పోరాడి బాబ్లీ చనిపోయింది.దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇవి చదవండి:
EAGLE Operation: కట్టలుకట్టలుగా డబ్బు స్వాధీనం.. ఈగల్ ఆపరేషన్ సక్సెస్
Homosexuality:స్నేహం.. స్వలింగ సంపర్కం.. ఆపై హత్య చేసి బాడీ ముక్కలు ముక్కలు!