Delhi Railway Station Stampede: ఎక్కువ టిక్కెట్లు ఎందుకు అమ్మారు?.. తొక్కిసలాటపై రైల్వేను నిలదీసిన కోర్టు
ABN , Publish Date - Feb 19 , 2025 | 06:45 PM
రైలు బోగీల్లో సంఖ్యను పరిమితం చేయడం, దానిని ఉల్లంఘించిన వారికి 6 నెలల జైలు విధించే రైల్వే యాక్ట్‌లోని సెక్షన్‌ను అమలు చేసేలా చూడాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో గతవారం తొక్కిసలాట జరిగి 18 మంది మృతి చెందిన ఘటనపై కేంద్రం, భారత రైల్వేలపై ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు తీవ్ర స్థాయిలో స్పందించింది. పరిమితికి మించి ఎక్కువ టికెట్లు ఎందుకు అమ్మారని చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ గేదెలతో కూడిన ధర్మాననం ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా కేంద్రం, రైల్వేను ఆదేశించింది.
MUDA Case: సీఎంకు లోకాయుక్త పోలీసులు క్లిన్‌చిట్
రైలు బోగీల్లో సంఖ్యను పరిమితం చేయడం, దానిని ఉల్లంఘించిన వారికి 6 నెలల జైలు విధించే రైల్వే యాక్ట్‌లోని సెక్షన్‌ను అమలు చేసేలా చూడాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై కోర్టు విచారణ జరిపింది. ''ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేసేలా ఉన్న నిబంధనలు అమలు చేయడం, జరిమానాలు విధించడంపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇంత చిన్న విషయాన్ని మీరు తూ.చ. తప్పకుండా అమలు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు. రద్దీ సమయాల్లో కనీసం సంఖ్యకు తగ్గట్టుగా సీటింగ్ కెపాసిటీ పెంచి ఉండాలి. దాన్ని కూడా నిర్లక్ష్యం చేసినట్టు కనిపిస్తోంది. బెర్త్‌ల సంఖ్య కంటే ఎక్కువ టికెట్లు ఎందుకు అమ్మారు?" అని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది.
హైకోర్టు తీవ్ర స్థాయిలో నిలదీయడంలో రైల్వేల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటామని, పరిస్థితికి సంబంధించిన అన్ని అంశాలను రైల్వే బోర్డు పరిశీలిస్తుందని తెలిపారు. దీంతో తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
Delhi CM Oath: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి కేజ్రీవాల్, అతిషి హాజరవుతారా?
PM Kisan: రైతులకు అలర్ట్.. ఫిబ్రవరి 24లోపు ఈ పని చేయండి.. లేదంటే..
Ayodhya Ram Temple: ఆ వేడుక వల్ల అయోధ్య రామమందిరం పనులకు బ్రేక్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.