Vice Presidential Election 2025: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:53 PM
తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును ఇప్పటికే ఎన్డీయే ప్రకటించింది. ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు మోదీ ప్రభుత్వంలోని పలువురు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి.. తమ వంతు ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 19: తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును ఇప్పటికే ఎన్డీయే ప్రకటించింది. ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు మోదీ ప్రభుత్వంలోని పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే రంగంలోకి దిగి.. తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలకు ఇండియా కూటమి గండి కొట్టింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో నిలపాలని ఇండియా నిర్ణయించింది. మంగళవారం న్యూఢిల్లీలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇండియా కూటమి నుంచి డీఏంకే ఎంపీ తిరుచ్చి శివను రంగంలోకి దింపుతారంటూ ఊహాగానాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. కానీ ఇండియా కూటమి నుంచి బరిలో నిలిచే నేత ఎవరనేది మరికొన్ని గంటల్లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ దన్‌ఖడ్ అకస్మాతుగా రాజీనామా చేశారు. అనారోగ్య కారణంగానే తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. కానీ ఆయనకు ఇంకా రెండేళ్లకు పైగా పదవి కాలం ఉన్నప్పటికీ ఎందుకు రాజీనామా చేశారంటూ మోదీ ప్రభుత్వంపై ఇండియా కూటమిలోని పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శలు సంధించారు. ఇక జగదీప్ దన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది.
ఇక ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతారంటూ.. పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అయినా చివరకు ఆ పదవి ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వరించింది. దీంతో ఆయన ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి పదవులకు వివిధ రాష్ట్రాల గవర్నర్లను ఎన్డీయే ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మతోపాటు ఇటీవల ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ దన్‌ఖన్ సైతం ఈ పదవి చేపట్టేముందు గవర్నర్‌గా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే సీపీ రాధాకృష్ణను సైతం మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..
వీడని మిస్టరీ.. జల్లెడ పడుతున్న పోలీసులు
For More National News And Telugu News