Ranya Rao: నటి రన్యారావుకు ఏమి జరిగింది?.. ఫోటో వైరల్
ABN , Publish Date - Mar 07 , 2025 | 09:07 PM
నటి రన్యారావు ఫిర్యాదు చేయడం కానీ, లేఖ పంపడం కానీ చేస్తే ఆమెకు సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మి చౌదరి తెలిపారు.
బెంగళూరు: బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా పట్టుబడిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) వ్యహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. దుబాయ్ నుంచి తీసుకువస్తు్న్న 14.8 కిలోల బంగారంతో బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)లో మార్చి 3న అరెస్టు అయిన ఆమెను మూడు రోజుల డీఆర్ఐ కస్టడీకి ఆర్థిక నేరాల విచారణ కోర్టు ఆదేశించింది. ఆసక్తికరంగా ఇప్పుడు రన్యారావుకు చెందిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో కనిపిస్తోంది. దీంతో ఆమెకు ఏమి జరిగింది? విచారణ పేరుతో ఆమెపై దాడి జరిగిందా? అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Vyjayanthimala: వైజయంతిమాల క్షేమం.. వదంతులపై ఆమె కుమారుడు
ఫిర్యాదు చేస్తే సాయం చేస్తాం..
కాగా, రన్యారావు ఫోటో వైరల్ అవుతుండటంపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మి చౌదరి స్పందించారు. ''దాడి ఎవరు జరిపినా అలా చేయకూడదు. అందులో సందేహం లేదు. చట్టాన్ని ఎవరూ చేతలోకి తీసుకోరాదు. తప్పనిసరిగా విచారణ జరపాల్సి ఉంటుంది. మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు.. ఎవరిపైనా దాడి చేయడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను'' అని ఆమె అన్నారు. కమిషన్‌కు రన్యా ఫిర్యాదు చేయడం కానీ, లేఖ పంపడం కానీ చేస్తే ఆమెకు సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకవేళ ఆమె ఫిర్యాదు చేయకుంటే దానిపై కనీసం కామెంట్ కూడా తాము చేయలేమని చెప్పారు.
కాగా, డీఆర్ఐ విచారణలో తాను నేరం చేసినట్టు, దుబాయ్‌తో పాటు యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు తిరిగి వచ్చినట్టు రన్యా అంగీకరించారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ స్మగ్లింగ్ వ్యవహారాల్లో రన్యా వెనుక ఎవరెవరు ఉన్నారు? ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయనే విషయాలపై రన్యాను అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Aircraft Crash: కుప్పకూలిన ఐఏఎఫ్ జాగ్వార్ విమానం
Bihar Assembly Polls 2025: నిన్న, నేడు, రేపు కూడా ఆయనే సీఎం
Ranya Rao questioned by Police: నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు.. విచారణలో బయటపడ్డ కీలక విషయాలు
భారత్‌కు అప్పగించొద్దు.. చిత్రవధ చేస్తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.