Share News

Maharashtra: మహారాష్ట్రలో మత ఘర్షణలు.. లాఠీచార్జి, 30 మంది అరెస్టు

ABN , Publish Date - Sep 29 , 2025 | 02:47 PM

రంగోలి వేసిన వ్యక్తులను స్థానిక పోలీసులు గుర్తించారు. ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకరు పోలీసు కస్టడీలో ఉన్నారు. రంగోలి వివాదంతో రోడ్లపైకి వచ్చిన పలువురిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి జరిపారు.

Maharashtra: మహారాష్ట్రలో మత ఘర్షణలు.. లాఠీచార్జి, 30 మంది అరెస్టు
Clashes in Ahilyanagar

ముంబై: 'ఐ లవ్ మహమ్మద్' (I Love Mohammed) వివాదంపై మహారాష్ట్ర (Maharashtra)లోని అహిల్యానగర్ (Ahilyanagar)లో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. 30 మందిని అరెస్టు చేశారు.


వివాదం ఇలా మొదలైంది..

అహిల్యానగర్ సిటీలోని మలివాడ ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు 'ఐ లవ్ మహమ్మద్' రంగోలిని ఏర్పాటు చేశారు. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహిస్తూ ఒక వర్గానికి చెందిన వందలాది మంది సిటీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనలకు దిగారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వదంతులు నమ్మరాదని ప్రజలను కోరారు.


కాగా, రంగోలి వేసిన వ్యక్తులను స్థానిక పోలీసులు గుర్తించారు. ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకరు పోలీసు కస్టడీలో ఉన్నారు. రంగోలి వివాదంతో రోడ్లపైకి వచ్చిన పలువురిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి జరిపారు. అహిల్యానగర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశామని, ప్రజలు వదంతులు నమ్మరాదని పోలీసులు కోరారు.


ఇవి కూడా చదవండి..

విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు

ఆసియా కప్‌ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్‌

For More National News And Telugu News

Updated Date - Sep 29 , 2025 | 02:49 PM