Vijay Emotional Reaction On Karur Stampede: నా పై ప్రతీకారం తీర్చుకోండి అంతే కానీ..
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:33 PM
కరూర్ తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ తెలిపారు. ఈ ఘటనతో తన గుండె ముక్కలందని.. తనకు మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చెన్నై, సెప్టెంబర్ 30: కరూర్ తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని టీవీకే పార్టీ చీఫ్, హీరో విజయ్ తెలిపారు. ఈ ఘటనతో తన గుండె ముక్కలందన్నారు. ఈ ఘటనతో తనకు మాటలు సైతం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో నిజం వెలుగులోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడులోని కరూర్‌లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై విజయ్ తొలిసారి స్పందించారు. అందుకు సంబంధించిన వీడియోను హీరో విజయ్ మంగళవారం విడుదల చేశారు. తనపై అమిత ప్రేమతో ప్రజలు ఈ సభకు తరలి వచ్చారన్నారు. బాధిత కుటుంబాలను త్వరలో పరామర్శిస్తానని ఈ సందర్భంగా విజయ్ వెల్లడించారు. ప్రజల భద్రతకే తాను ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. తనను టార్గెట్ చేయండి.. అంతేకానీ ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టొద్దంటూ తన ప్రత్యర్థులకు టీవీకే చీఫ్ విజయ్ సూచించారు.
తమ తప్పు లేకపోయినా.. తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ తనకు ఎదురు కాలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. కావాలనుకుంటే తనపై ప్రతీకారం తీర్చుకో వచ్చంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌కు విజయ్ సవాల్ విసిరారు. కానీ తన పార్టీ కార్యకర్తల జోలికి మాత్రం వెళ్లకండంటూ వారికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటన కరూర్‌లోనే ఎందుకు జరిగింది? అంటూ విజయ్ సందేహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఎలా జరిగిందో తనకు ఇప్పటికీ అర్థం కావట్లేదన్నారు. కరూర్ ఘటన కారణాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పేర్కొన్నారు. అయితే తమకు అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే సభ నిర్వహించామని విజయ్ గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
Chidambaram: 26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి