Shahjahanpur Train Accident: రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:38 PM
రైల్వే గేట్ వద్ద జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతూనే ఉంటారు. కానీ కొంతమంది వాటిని లెక్కచేయకుండా రైలు గేట్ పడ్డాకూడా కింది నుంచి దూరి వెళ్లే ప్రయత్నం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాంటి ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: తప్పు అని తెలిసినా.. కొంత మంది చేసే నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఒక చిన్న తప్పువల్ల కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో రైల్వే ట్రాక్ దాటుతుండగా మోటార్ సైకిల్‌ను ప్యాసింజర్ రైలు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెదిన ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. రౌజా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. లక్నో వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు మోటర్ వెహికిల్ గేట్ దాటుతున్న సమయంలో ఢీకొట్టింది. ఆ బైక్‌పై ఉన్న ఐదుగురు చనిపోయారని ఎస్పీ రాజేష్ ద్వివేదీ తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు ఎస్పీ. మృతులు సేథ్ పాల్(40),అతని భార్య పూజ(38), వారి ఆరేళ్ల ఇద్దరు పిల్లలు, సేథ్ పాల్ బావమరిది హరి ఓమ్(45)గా గుర్తించారు పోలీసులు. వీరంతా లఖీంపుర్ జిల్లాలోని వంకా గ్రామానికి చెందిన వారని ఎస్పీ ద్వివేదీ తెలిపారు. నిగోహి గ్రామంలో హరి ఓమ్ ఇంటికి వెళ్లి తిరిగి బైక్‌పై వస్తుండగా ఈ ఘనన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.
రైల్వే గేట్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
గేటు పడగానే మీ వాహనాన్ని గేటుకు 5 మీటర్ల దూరంలో ఆపండి. గేటు కింద నుంచి దూరి వెళ్లడానికి ప్రతయ్నంచకండి. ట్రాక్‌ల మధ్య, పట్టాల సమీపంలో నిలబడి సెల్ఫీలు దిగడం, ఫోన్ మాట్లాడటం వంటివి చేయకూడదు. సెక్యూరిటీ లేని గేట్ల వద్ద మరింత జాగ్రత్తలు పాటించాలి. ‘చూడు-విను-వెళ్లు’ అనే సూత్రాన్ని ప్రజలు పాటించారు. రైల్వే గేట్ వద్దకు వచ్చినపుడు రైలు హారన్ శబ్దాన్ని వినండి.. చెవిలో హెడ్ ఫోన్లు వెంటనే తీసేయండి. రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫారమ్ దాటడానికి పట్టాలపై నవవొద్దు. ఫుట్ ఓవర్ బ్రిడ్జినే వాడాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ బాంబు బెదిరింపు.. విమానం అత్యవసర ల్యాండింగ్..
మసీదులో బాంబు పేలుడు.. ఏడుగురి మృతి
For More National News And Telugu News