US Deportaion: అమెరికా బహిష్కరణ జాబితాలో 487 మంది ఇండియన్స్
ABN , Publish Date - Feb 07 , 2025 | 08:29 PM
భారతీయ వలసదారుల పట్ల అమెరికా అధికారులు అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై అడిగినప్పుడు, ఈ విషయమై అమెరికాకు తమ ఆందోళనను తెలియజేశామని మిస్రీ సమాధానమిచ్చారు. భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా సంప్రదింపులు కొసాగిస్తున్నామని చెప్పారు.

న్యూఢిల్లీ: అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే ప్రక్రియ అమెరికా కొనసాగిస్తోంది. భారత్‌కు సైతం తొలివిడతగా 104 మందిని ప్రత్యేక విమానంలో పంపింది. ఈ నేపథ్యంలో అమెరికా బహిష్కరణ జాబితాలో ఎంతమంది భారతీయులన్నారనేది దానిపై భారత విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిస్రీ (Vikram Misri) శుక్రవారంనాడు స్పందించారు. అమెరికా బహిష్కరణ జాబితాలో 487 మంది ఉన్నారని తెలిపారు. ఆ వివరాలు తాము అడిగామని, 298 మందికి సంబంధించిన వివరాలు అందజేశారని చెప్పారు.
భారతీయ వలసదారుల పట్ల అమెరికా అధికారులు అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై అడిగినప్పుడు, ఈ విషయమై అమెరికాకు తమ ఆందోళనను తెలియజేశామని మిస్రీ సమాధానమిచ్చారు. భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా సంప్రదింపులు కొసాగిస్తున్నామని చెప్పారు. 2012లో అక్రమవలసదారులకు సంకెళ్లు వేశారంటూ ప్రభుత్వం నిరసన తెలిపినట్టు తమ దగ్గర రికార్డులు లేవని తెలిపారు.
అక్రమ వలసదారులను వెనక్కిపపంపడం కొత్తేమీకాదని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా విదేశాంగ శాఖ గురువారం ప్రస్తావించిందని చెప్పారు. అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో తరలిస్తుండటంపై మాట్లాడుతూ, మునుపటి కంటే ఈ ప్రక్రియ భినంగా ఉందన్నారు. నిజానికి అమెరికా నుంచి రిటర్న్ అవుతున్న వారికి సంబంధించి భిన్న క్యాటగిరీలు ఉంటాయని, కొందరు తిరిగి వస్తుండగా, కొందరిని బహిష్కృతులుగా వస్తున్నారని, ఇదంతా జ్యుడిషియల్, లీగల్ ప్రక్రియకు అనుగుణంగా ఉంటుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ
Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి