Share News

Cabinet Meeting: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 03:21 PM

Cabinet Meeting: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇస్రోలో మూడో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రోదసిలోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Cabinet Meeting: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు
Union Cabinet Meeting Decisions

న్యూఢిల్లీ, జనవరి 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధానంగా ఇస్రోలో మూడో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రోదసిలోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గుడ్‌ న్యూస్ చెప్పింది కేంద్రం. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. త్వరలో వేతన సంఘం చైర్మన్‌‌ను నియమించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.



ఇవి కూడా చదవండి...

కారు సిద్ధంగా లేక.. ఆటోలో ఆస్పత్రికి వెళ్లిన సైఫ్..

సైఫ్ అలీఖాన్‌పై దాడిలో సంచలన విషయాలు..

Read Latest National News And Telugu News

Updated Date - Jan 16 , 2025 | 03:41 PM