Tungabhadra: 10న తుంగభద్ర జలాల విడుదల
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:39 AM
తుంగభద్ర డ్యాం నుంచి ఎగువ, దిగువ కాలువలకు జూలై 10న నీరు విడుదల చేయాలని ఐసీసీ నిర్ణయించింది. డ్యాంలో ఉన్న నిల్వల ఆధారంగా నీటిని విడుదల చేయాలని తీర్మానం చేసింది.
- ఐసీసీ సమావేశంలో నిర్ణయం
బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర డ్యాం నుంచి ఎగువ, దిగువ కాలువలకు జూలై 10న నీరు విడుదల చేయాలని ఐసీసీ నిర్ణయించింది. డ్యాంలో ఉన్న నిల్వల ఆధారంగా నీటిని విడుదల చేయాలని తీర్మానం చేసింది. కర్ణాటకలోని ఆర్‌బీఎంసీ, ఇతర కాలువలకు జూలై 2 నుంచి నవంబరు 31 వరకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. బెంగళూరులోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో శుక్రవారం 124వ ఐసీసీ కమిటీ సమావేశం జరిగింది. అధ్యక్షుడు శివరాజ్ తంగడిడే అధ్యక్షత వహించారు.
తుంగభద్ర బోర్డు(Tungabhadra) Board) అధికారులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. డ్యాంలో శుక్రవారం 56.746 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. తీర్మానం మేరకు, ఆర్‌బీఎంసీ, కొప్పళ జిల్లా పరిధిలో ఉండే ఆయకట్టుకు జూలై 2 నుంచి 31 వరకు తుంగభద్ర ఎడమ ప్రధాన కాలువ నుంచి రెండు వేల క్యూసెక్కులు వదులుతారు. జూలై 16 నుంచి 31 వరకు మూడు వేల క్యూసెక్కులు, ఆగస్టు 1 నుంచి నవంబరు 30 వరకు 4100 క్యూసెక్కులు వదులుతారు.

కుడి ఎగువ కాలువకు జూలై 10 నుంచి జూలై 31 వరకు సగటున 700 క్యూసెక్కులు, ఆగస్టు 1 నుంచి నవంబరు 30 వరకు 1300 క్యూసెక్కులు, కుడి దిగువ కాలువకు జూలై 10 నుంచి జూలై 31 వరకు 500 క్యూసెక్కులు, ఆగస్టు 1 నుంచి నవంబరు 30 వరకు 650 క్యూసెక్కుల నీటిని వదులుతారు. లభ్యత ఆధారంగా వివిధ కాలువలకు నీటిని విడుదల చేయాలని ఐసీసీ తీర్మానం చేసింది.
2న సీఎంతో చర్చలు
తుంగభద్ర జలాల విడుదల, ఆనకట్టు భద్రత, పంటల సంరక్షణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో జూలై 2 సమావేశం జరుపుతామని ఐసీసీ అధ్యక్షుడు, మంత్రి శివరాజ్ తంగడిగే తెలిపారు. ఈ ఏడాది ఖరీ్‌ఫకు మాత్రమే నీటిని విడుదల చేస్తామని టీబీపీ బోర్డు అధికారులు తెలిపారు. దీంతో రబీ సాగుపై రైతుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.
ఈ అంశంపై మరోసారి సమావేశమై చర్చిస్తామని అధికారులు తెలిపారు. సమావేశంలో తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్, బోర్డు కర్ణాటక అధికారులు, ఎమ్మెల్యేలు గవియప్ప, పంపనగౌడ బాదర్లి, బసవనగౌడ, మాజీ మంత్రి బి.నాగేంద్ర, సీఏడీఏ అధ్యక్షుడు హసనాసబ్ దోతిహల్, కె.రాఘవేంద్ర హిట్నాల్, కొప్పళ, బళ్లారి, రాయచూరు, విజయనగర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం ధర భారీగా తగ్గిందోచ్, కానీ వెండి మాత్రం
ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి
Read Latest Telangana News and National News