Donald Trumph: ట్రంప్ రిటర్న్స్.. భారత్‌కు కలిసొచ్చే అంశాలివే..
ABN , Publish Date - Jan 20 , 2025 | 08:14 PM
రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే అంతగానే వేగంగానే నిర్ణయాలు తీసుకుంటామని, అమెరిను గొప్పగా మారుస్తామని, అక్రమ వలసలు అరికడతామని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు.
న్యూఢిల్లీ: ట్రంప్ రిటర్న్స్..రెండోసారి అగ్రరాజ్యాధినేతగా ప్రమాణస్వీకారానికి ఆయన సిద్ధమయ్యారు. తొలిసారి అధ్యక్షుడిగా పగ్గాలు పట్టినప్పుడు ట్రంప్ ఏమాత్రం వెరవకుండా ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలతో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే అంతగానే వేగంగానే నిర్ణయాలు తీసుకుంటామని, అమెరిను గొప్పగా మారుస్తామని, అక్రమ వలసలు అరికడతామని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. మొదటి అడుగే 100కు పైగా కార్యనిర్వాహక ఆదేశాలతో ఆయన సంచలనం సృష్టించబోతున్నారని ట్రంప్ ఆంతరంగిక వర్గాలు బలంగా చెబుతున్నాయి. అమెరికాతో సంబంధాలకు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, భారత్ సైతం వాషింగ్టన్‌తో భారత్ సబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తోంది.
Nita Ambani - Donald Trump: ట్రంప్ డిన్నర్‌లో నీతా అంబానీ కట్టిన చీర ప్రత్యేకతలు ఇవే..
ఇండియా-యూఎస్ సంబంధాలపై ప్రభావం
శ్వేతసౌధానికి ట్రంప్ తిరిగి వస్తుండటంతో ఇండియా ఎకానమీతో పాటు గ్లోబల్ ట్రేడ్‌కు ఎదురయ్యే చిక్కులు, సవాళ్లు ఏవిధంగా ఉండబోతున్నాయనే చర్చ ఇప్పటికే జరుగుతోంది. ముఖ్యంగా, భారత్‌కు అతిపెద్ద ఎక్స్‌పోర్ట్ డిస్టినేషన్‌గా అమెరికా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం ఎగుమతుల్లో 18 శాతం అమెరికాకు వెళ్లాయి. ఈ క్రమంలో అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై మరింత టారిఫ్ వేసే అవకాశాలను ట్రంప్ పరిశీలించ వచ్చు.
హెచ్-1బి వీసాలు
అమెరికాలో కెరీర్‌ను ఆశించే వారు విషయానికి వస్తే, ట్రంప్ సహజంగానే విదేశీ ప్రతిభ కంటే అమెరికా వర్కర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ క్రమంలో హెచ్-1బి వీసాలున్న వారు, వీసాలు కోరుతున్న వారు ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. హె-1బీ వీసాలున్న వారికి అమెరికా కంపెనీలు నిర్దిష్ట రంగాల్లో ప్రతిభావంతులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో భారత్‌లోని ప్రతిభావంతులకు అవకాశాలు మెండు. ఈదిశగా భారత్ నుంచి హెచ్-1బి వీసాకు ప్రాధాన్యత ఎక్కువే. అమెరికాలోని ఉద్యోగాల్లో స్థానిక ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వడానికి ట్రంప్ ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, ఆయన మద్దతుదారులైన టెల్సా సీఈఓ ఎలాన్స్ మస్క్ వంటి కొందరు హెచ్-1బి వీసాలకు సానుకూలంగా ఉన్నారు. ఇది హెచ్-1బి వీసాలు ఆశించే వారికి ఇది శుభపరిణామని చెప్పవచ్చు.
ఎనర్జీ సెక్యూరిటీ..
ఇక.. ఎనర్జీ ఇండిపెండెన్స్‌కి ట్రంప్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది భారత్‌కు అనుకూలించే అంశమే. అమెరికాలో మరిన్ని ఆయిల్ డ్రిల్లింగ్స్‌కు అనుమతించాలని ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. ఇందువల్ల మార్గెట్‌లో చమురు ధరలు స్థిరంగా ఉంటాయని ఆయన ఢంకా బజాయిస్తున్నారు. ఇండియా వంటి ఇంధనం దిగుమతి చేసుకునే దేశాలకు ఇది నిస్సందేహంగా మంచి పరిణామమే అవుతుంది.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: పేదల హక్కుల కోసం ‘వైట్ టీషర్ట్’ ఉద్యమం
Saif Ali Khan: సైఫ్‌పై దాడి చేసింది బంగ్లాదేశీయుడు!
Read Latest National News and Telugu News