TMC: పశ్చిమబెంగాల్ వద్దు.. బంగ్లానే ముద్దు
ABN , Publish Date - Feb 04 , 2025 | 09:06 PM
రాష్ట్రాల పేర్లు మార్చడం ఇండియాలో కొత్త కాదు. 2011లో ఒరిస్సా పేరును ఒడిషాగా మార్చారు. ఇతర సిటీలు కూడా పేరు మార్పు సంతరించుకున్నాయి. బాంబే పేరు 1995లో ముంబైగా మారింది. 1996లో మద్రాసు పేరు చెన్నైగా మారింది.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ పేరును 'బంగ్లా'గా మార్చాలనే అంశాన్ని తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరోసారి లేవనెత్తింది. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం, చరిత్రను ప్రతిబింబించేందుకు ఈ మార్పు తప్పని సరిని పేర్కొంది. టీఎంసీ నేత రితబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) రాజ్యసభ జీరో అవర్‌లో మంగళవారంనాడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రం పేరు మార్పును ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానాన్ని పశ్చిమబెంగాల్ అసెంబ్లీ 2018లో ఆమోదించిందని, అయితే ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని అన్నారు.
PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం
''చరిత్ర, సంస్కృతి, గుర్తింపు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పేరు మార్పు జరగాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. 1947 విభజన తరువాత భారత్ వైపు ఉన్న భాగానికి వెస్ట్ బెంగాల్ అనే పేరు పెట్టారు. తూర్పు ప్రాంతాన్ని ఈస్ట్ పాకిస్థాన్‌గా పిలిచేవారు. అది కాస్తా 1971లో బంగ్లాదేశ్ అయింది. ఈరోజు ఈస్ట్ పాకిస్థాన్ అనేది లేదు'' అని రితబ్రత బెనర్జీ అన్నారు. ఈ చారిత్రక మార్పును పరిగణనలోకి తీసుకుని రాష్ట్రం పేరును మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రాల పేర్లు మార్చడం ఇండియాలో కొత్త కాదు. 2011లో ఒరిస్సా పేరును ఒడిషాగా మార్చారు. ఇతర సిటీలు కూడా పేరు మార్పు సంతరించుకున్నాయి. బాంబే పేరు 1995లో ముంబైగా మారింది. 1996లో మద్రాసు పేరు చెన్నైగా మారింది. 2001 కలకత్తా పేరు కోల్‌కతాగా మారింది. 2014లో బంగలోర్ పేరును బెంగళూరుగా మార్చారు.
మరిన్ని వార్తల కోసం..
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి