Toll Tax Employees Protest: టోల్ గేట్లను తెరిచారు.. వాహనాలను ఉచితంగా పంపించారు!
ABN , Publish Date - Oct 21 , 2025 | 02:02 PM
తమకు జీతాలు ఇవ్వట్లేదని ఆదివారం సమ్మెకు దిగిన సిబ్బంది, టోల్ ఫీజు వసూలు చేయకుండానే వాహనాలన్నింటినీ పంపించేశారు. గేట్లు ఓపెన్ చేయడంతో దీంతో వేలాది వాహనాలు సర్రున జారుకున్నాయి.
ఉత్తర ప్రదేశ్, అక్టోబర్ 21: తమకు జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని, ఎన్ని సార్లు అడిగినా దీపావళి బోనస్ కూడా ఇవ్వట్లేదని ఆగ్రహించిన టోల్ ప్లాజా సిబ్బంది బిగ్ షాక్ ఇచ్చారు. దీపావళి పండుగ వేళ వేలాది వాహనాలు టోల్ గేట్ నుంచి వెళతాయి. వీటికి టోల్ గేట్ సిబ్బంది టోల్ ఫీజు వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే తమకు జీతాలు ఇవ్వట్లేదని ఆదివారం సమ్మెకు దిగిన సిబ్బంది, టోల్ ఫీజు వసూలు చేయకుండానే వాహనాలన్నింటినీ పంపించేశారు. గేట్లు ఓపెన్ చేయడంతో వేలాది వాహనాలు సర్రున జారుకున్నాయి. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న ఫతేహాబాద్ టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటన వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.లక్షల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
యూపీకి ప్రధాన రవాణా మార్గంగా ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఆగ్రా, లక్నో నగరాలను డైరెక్ట్ గా కలుపుతుంది. ఈ టోల్ గేట్ పై వాహనాలు టోల్ చెల్లించకుండా బూత్‌లను దాటుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత వారం తమ బ్యాంకు ఖాతాల్లో దీపావళి బోనస్ జమ అవుతుందని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు అది జరగలేదని సదరు కంపెనీకి చెందిన ఉద్యోగులు చెప్పారు. కంపెనీ రూ.1100 బోనస్ ఇస్తే.. గతంలో రూ.5000 ఇచ్చారని ఉద్యోగుల వాదించారు. ఆగ్రహానికి గురై ఆదివారం రాత్రి టోల్ బూత్ బూమ్ బ్యారియర్‌ను ఎత్తి వాహనాలను వెళ్లనిచ్చారు. సుమారు 10 గంటలపాటు వేలాది వాహనాలు టోల్ గేట్ మీదుగా వెళ్లిపోయాయి. అనంతరం అధికారులు బోనస్ ఇవ్వబోతున్నామని హామీ ఇవ్వడంతో సిబ్బంది సమ్మెను ముగించారు.
ఇవి కూడా చదవండి:
POCSO Act judgment: మైనర్లపై లైంగిక దాడి.. అలా చేసినా అత్యాచారమే.. బాంబే హైకోర్టు తీర్పు..
Diwali Celebrations: అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్: ప్రధాని మోదీ