Coal Mine: బొగ్గు గనిలో కూలిన పైకప్పు.. ముగ్గురు మృతి
ABN , Publish Date - Mar 06 , 2025 | 08:49 PM
బొగ్గు గనిలో అనుకోకుండా పై కప్పు కూలి ప్రమాదం సంభవించింది. అదే సమయంలో అక్కడ పలువురు కార్మికులు పనిచేస్తుండగా, ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతోపాటు అక్కడ చిక్కుకున్న మరికొంత మందిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఓ బొగ్గు గనిలో ఆకస్మాత్తుగా పైకప్పు కూలిపోయింది. దీంతో గనిలో పనిచేస్తున్న కార్మికులలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ విషాదకర ప్రమాదం మధ్యప్రదేశ్(Madhya Pradesh) బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, SDRF, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో గనిలో మరికొంత మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (WCL) పఠఖేడ ప్రాంతంలో జరిగింది. అక్కడ కార్మికులు ఛత్తర్‌పూర్-1 గని లోపల దాదాపు 3.5 కి.మీ దూరంలో ఉన్న కాంటూర్ మైనర్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆ సమయంలో పైకప్పు కూలడంతో చాలా మంది దాని కింద చిక్కుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురు ఉద్యోగులు మరణించినట్లు సమాచారం అందింది.
కొనసాగుతున్న సహాయక చర్యలు
మృతులలో షిఫ్ట్ ఇంచార్జ్ గోవింద్, ఓవర్ మాన్ హరి చౌహాన్, మైనింగ్ సర్దార్ రామ్‌దేవ్ పాండౌలే ఉన్నారు. ఈ విభాగాన్ని జాయ్ మైనింగ్ సర్వీస్‌గా గుర్తించారు. ఈ గనిలో ఆస్ట్రేలియన్ యంత్రాలు అమర్చబడి ఉన్నాయి. ఘటన జరిగిన వెంటనే కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ, ఎస్పీ నిశ్చల్ ఎన్ ఝరియా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ ఝరియా తెలిపారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు తమ కుటుంబ సభ్యులను కాపాడాలని కోరుతున్నారు. మరోవైపు రెస్క్యూ బృందాలు గనిలోకి ప్రవేశించి, చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రజల డిమాండ్
ఈ ప్రమాదం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు గనుల్లో జరిగే ప్రమాదాలు, ముఖ్యంగా పైకప్పు కూలడం వంటి ఘటనలు, తరచుగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు కార్మికుల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. ప్రభుత్వం ఈ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, గనులలో సురక్షితమైన పని పద్ధతులను అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు వారి ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇటీవల తెలంగాణ SLBC టన్నెల్ ప్రమాద ఘటన మరువక ముందే, మళ్లీ అలాంటి ప్రమాదం జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
New AI: డీప్‌సీక్, ఓపెన్ ఏఐలకు పోటీకి కొత్తగా మరో ఏఐ..
Spam Calls: స్పామ్ కాల్స్ కట్టడి కోసం కీలక చర్యలు.. రోజుకు 13 మిలియన్ల కాల్స్ బ్లాక్
Alert: ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో కీలక మార్పులు..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News