Uttar Pradesh: దారుణం: గంటల వ్యవధిలో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చిన్నారులు మృతి
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:50 AM
ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు గంటల వ్యవధిలో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh Family Tragedy) లోని నెబువా నౌరంగియా ప్రాంతంలో చోటుచేసుకుంది. 48 గంటల వ్యవధిలో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరి.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
యూపీ రాష్ట్రం, నెబువా నౌరంగియా బ్లాక్‌లోని గులార్హియా తోలా గ్రామంలో పింటు గౌర్ అనే వ్యక్తి అనే కుటుంబంలో ముగ్గురు పిల్లలు(Three Children) మరణించారు. అతడి పెద్ద కుమార్తె మంజు(7) వారం క్రితం అనారోగ్యానికి గురైంది. స్థానికంగా ఉండే డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించినప్పటికీ బాలిక ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో మరో ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత కొన్ని గంటలకే గౌర్(Pintu Gaur Family)కు చెందిన చిన్న కుమార్తె మూడేళ్ల వయస్సున్న ఖుషి , ఐదేళ్ల ఏళ్ల కుమారుడు కృష్ణ జ్వరంతో కన్నుమూశారు. వీరిద్దరూ కూడా స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు తీసుకెళ్తుండా మరణించారు. ఇక గంటల వ్యవధిలో ముగ్గురు చిన్నారు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. పింటు గౌర్ దంపతులు గుండెలు పగిలేలా రోదించారు.
మరోవైపు ముగ్గురు చిన్నారుల మృతి నేపథ్యంలో ఆ రాష్ట్ర వైద్యశాఖ అధికారులు అలెర్ట్(UP Health Alert) అయ్యారు. గ్రామాన్ని సందర్శించి.. చిన్నారుల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ఆ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి.. మిగిలిన పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పిల్లల మృతికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు గ్రామంలో 57 మంది పిల్లలకు మెడికల్ టీమ్ మలేరియా, డెంగీ పరీక్షలు(Malaria Dengue Testing) నిర్వహించినట్లు ఓ అధికారి తెలిపారు. కాస్తా అనారోగ్య లక్షణాలు కనిపించిన పిల్లలకు, పెద్దలకు అవసరమైన మందులు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆ గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
MS Dhoni Wedding Speech: టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పెళ్లిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్..
మహిళల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే!