Minister: నోటికొచ్చినట్టు మాట్లాడేందుకు ఇది ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీసు కాదు..
ABN , Publish Date - Mar 18 , 2025 | 01:55 PM
బీజేపీ నేతలపై మంత్రి ప్రియాంకఖర్గే విరుచుకుపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడేందుకు ఇదేం ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీసు కాదు.. అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి.
బెంగళూరు: నోటికొచ్చినట్టు మాట్లాడేందుకు ఇదేం ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీసుకాదని మంత్రి ప్రియాంకఖర్గే(Minister Priyanka Karghe) విరుచుకుపడ్డారు. శాసనసభలో సోమవారం మంత్రి మాట్లాడుతూ అంబేడ్కర్‌ను ఎన్నికలలో ఓడించింది కాంగ్రెస్ లేదా సావర్కర్ అనే అంశంపై తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే అరవింద బెల్లద్ మాట్లాడుతూ.. కేబినెట్ నుంచి తొలగించింది ఎవరని, ఎన్నికలలో ఓడించింది ఎవరని, సమాధికి స్థలం ఇవ్వకుండా చేసింది ఏ పార్టీ అని ప్రశ్నిం చారు. మంత్రి ప్రియాంక ఖర్గే జోక్యం చేసుకుని 1952లో అంబేడ్కర్ రాసిన లేఖలో తనను ఓడించింది సావర్కర్ అంటూ రాసుకున్నారని, సదరు లేఖను ప్రదర్శిస్తే రాజీనామా చేస్తారా..? అని సవాల్ విసిరారు. లేఖలో కాంగ్రెస్ పేరు ప్రస్తావించలేదన్నారు. ఈ వివాదం ఇరుపక్షాల మధ్య మరింత వాగ్వాదానికి కారణమైంది. అంబేడ్కర్ రాసిన లేఖను మంత్రి సభలో చదివి వినిపించారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP Leader: పోలీసులపై బీజేపీ నేత ఆగ్రహం.. కుక్కల వ్యాన్‌లో ఎక్కమంటారా..
నకిలీ ఔషధాల నియంత్రణకు చర్యలు: మంత్రి దినేశ్ గుండూరావ్
రాష్ట్రంలో నకిలీ ఔషధాల నియంత్రణకు అన్ని రకాల చర్యలు చేపడతామని వైద్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. పరిషత్‌లో ప్రశ్నోత్తరాల వేళ సభ్యుడు ఎస్ రవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధాన మిచ్చారు. నకిలీ మందులు తయారు చేసిన, విక్రయి స్తున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు. 2022-23లో మొత్తం 6 కేసులు, 2023-24లో 10 కేసులు, 2024-25లో 4 కేసులు నమోదయ్యాయని, వెంటనే డ్రగ్ రీకాల్ పాలసీ అమలు చేసి మరింత కఠినచర్యలు చేపడ తామన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదన్నారు.
కలబురగిలో నిమ్హాన్స్ మాదిరి ఆసుపత్రి: మంత్రి
కలబురగి జిల్లాలోని మెడికల్ కాలేజిలో నిమ్హాన్స్ మాదిరి ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉద్దే శించిందని వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ శరణప్రకాశ్ పాటిల్ అభిప్రాయపడ్డారు. 2025-26 బడ్జెట్‌లోనూ ప్రక టించారన్నారు. పరిషత్‌లో ప్రశ్నోత్తరాల వేళ సభ్యుడు తిప్పణ్ణప్ప కమకనూరు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. మైసూరు, కలబురగి జిల్లాల్లో మెడికల్ కళాశాలల్లో నిమ్హాన్స్ మాదిరి సంస్థలను రూ.100కోట్లతో తగిన మానవ వనరులు, సౌలభ్యాలతో ఏర్పాటు చేయదలిచామన్నారు.
సౌరశక్తి కేంద్రాలకు సిద్ధం: మంత్రి జార్జ్
కలబురగి, రాయచూరు జిల్లాల్లో సౌరశక్తి, పవనశక్తి ఉత్పాదనా కేంద్రా లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్ పేర్కొన్నారు. పరిషత్‌లో ప్రశ్నోత్తరాల వేళ సభ్యుడు బసవనగౌడ బాదర్లి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పవన, సౌరశక్తితోపాటు ఇతరత్రా మూలాలతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కర్ణాటక ఆధునీకరించిన ఇంధన పాలసీ 2022-27ను అమలు చేయనున్నట్టు తెలిపారు. బిడ్ ద్వారా వ్యక్తిగతంగా లేదా గ్రూపులుగా, ప్రైవేట్ పార్కుల ద్వారా విద్యుత్ పథకాలను పంచుకునేలా ఉద్దేశించామన్నారు.

యూనివర్సిటీల్లో గుణాత్మకత కాపాడతాం
యూనివర్సిటీలలో బోధనా సిబ్బంది భర్తీ చేపట్టడం ద్వారా గుణాత్మకతను కాపాడుతామని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ పేర్కొ న్నారు. పరిషత్‌లో సభ్యుడు ఎస్‌వీ సంకనూరు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ కర్ణాటక యూనివర్సిటీలో బోధన 416, బోధనేతల 849 పోస్టులు, బెంగళూరు యూనివర్సిటీలో బోధన 234, బోధనేతర 780, మైసూరు యూనివర్సిటీలో బోధన 171, బోధనేతర 268 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. అన్ని పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ మోదం పొందాల్సి ఉందన్నారు. వీటిని సాధ్య మైనంత త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టన్నుల్లో స్మగ్లింగ్.. గ్రాముల్లో పట్టివేత
టికెట్ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు
ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..
వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News and National News