Share News

Indian alcohol survey 2025: ఇండియాలో కొత్త ట్రెండ్.. ఈ రాష్ట్రాల్లో మందు'భామలే' ఎక్కువంట..

ABN , Publish Date - Jun 17 , 2025 | 09:01 AM

Women and Alcohol Consumption: మద్య నిషేధం కోసం పోరాటాలు చేసే మహిళామణులను చూసే ఉంటారు. కానీ, ఇండియాలోని ఈ రాష్ట్రాల్లోని మహిళలు మాత్రం పూర్తిగా రివర్స్. ఇక్కడ మందుబాబుల కంటే మందు'భామలే' ఎక్కువ. భారతదేశంలో అత్యధికంగా మద్యం సేవిస్తున్న స్త్రీలు ఏ రాష్ట్రాల్లో ఉన్నారో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

Indian alcohol survey 2025: ఇండియాలో కొత్త ట్రెండ్.. ఈ రాష్ట్రాల్లో మందు'భామలే' ఎక్కువంట..
Indian States Where Women Drink More Than Men

Indian States Where Women Drink More Than Men: ఇండియాలో కొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. అన్ని రంగాల్లో పురుషులతో పోటీపడుతున్న మహిళలు ఈ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు. మందుబాబుల కంటే మేమేం తక్కువ అంటూ నారీమణులూ మద్యం బాటిళ్లు ఎత్తి గట గటా తాగేస్తున్నారు. అలా అని వాళ్లు ఏ మెట్రోపాలిటన్ సిటీల్లో నివసించే వాళ్లు మీరూహిస్తే మాత్రం తప్పులో కాలేసినట్టే. ఇండియన్ ఆల్కహాల్ సర్వే-2025 ప్రకారం భారతదేశంలో పురుషుల కంటే ఎక్కువగా మద్యం సేవిస్తున్న రాష్ట్రాలు ఏవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.


మగమహారాజులే అత్యధికంగా ఆల్కహాల్ సేవిస్తారనే అని అభిప్రాయాన్ని ఇకపై మార్చుకోక తప్పదేమో! ఇప్పటికే జెన్ X, జెన్ Z, మిలీనియల్స్ లో మద్యం తాగేవారి సంఖ్య ఎక్కువే ఉంది. హైదరాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే యువతలో ఈ కల్చర్ బాగా పెరిగిపోతోంది. కానీ, ఇండియన్ ఆల్కహాల్ సర్వే-2025 ప్రకారం భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే మహిళలే పురుషుల కంటే అధికంగా మందు కొడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం టాప్-3లో ఉండగా.. తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్, అండమాన్ & నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి.


బీర్, విస్కీ, వైన్, వోడ్కా మొదలైన ఆల్కహాల్ ఆధారిత పానీయాలు సేవించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. వారాంతాల్లో పార్టీలు, పబ్ లు, అఫిషియల్, వ్యక్తిగత వేడుకల్లో మద్యపానీయాలు కామన్ గా కనిపిస్తున్నాయి. మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో వయసు, జెండర్ తో సంబంధం లేకుండా మద్యం తాగే సంస్కృతి నానాటికీ ఎక్కువవుతోంది. ఇండియాలో కేవలం మగాళ్లే మద్యపాన ప్రియులనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ, అనేక రాష్ట్రాల్లో మహిళలూ ఈ విషయంలో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పలు గిరిజన ప్రాంతాల్లో అనాది కాలం నుంచి సంప్రదాయ మద్యం సేవించే అలవాటు ఉండటమే ఒక కారణం.


మహిళలు అత్యధికంగా మద్యం సేవించే భారతీయ రాష్ట్రాలు ఇవే

  • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం, మహిళల్లో మద్యపానం పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. స్థానిక సంప్రదాయాలు, మారుతున్న జీవనశైలి, సామాజిక సంస్కృతులు మారడం, ఒత్తిడి వల్ల స్త్రీలు ఈ అనుసరిస్తున్నారని తేలింది.

  • ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడి మహిళల్లో మద్యం సేవించే రేటు 24.2%.

  • సిక్కింలో 16.2% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. వారు చాంగ్ అనే ప్రసిద్ధ స్థానిక బీరును తాగడానికి ఇష్టపడతారు.

  • ఈ జాబితాలో అస్సాం మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ 7.3% మహిళలు మద్యం సేవిస్తారు. విస్కీ ఎక్కువగా తాగుతారు.

  • తెలంగాణలో 6.7% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ మహిళల్లో ఈ రేటు ఎక్కువగా ఉంది. వేడుకలు, ఒత్తిడితో కూడిన పరిస్థితులలో మద్యం వినియోగం పెరిగేందుకు దారితీస్తున్నాయి.

  • జార్ఖండ్‌లో జరిపిన ఒక అధ్యయనంలో 6.1% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. అనేక గిరిజన వర్గాలలోని సాంస్కృతిక ఆచారాలే ఇందుకు కారణం.

  • అయితే తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మద్యం జోలికి వెళ్లరని నివేదికలు వెల్లడిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

పూజలు పేరుతో దారుణం..

ఎవరా ఐఏఎస్‌‌లు..?

For National News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 11:02 AM