Share News

Operation Nagni: కశ్మీర్‌లో ఆపరేషన్ నాగ్ని.. భారీగా ఆయుధాల పట్టివేత

ABN , Publish Date - Aug 05 , 2025 | 04:24 PM

ఉగ్రవాద స్థావరంలో ఒక పిస్తోలు, రెండు మ్యాగ్జైన్‌లు, 12 గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. 370వ అధికరణ రద్దయి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ జరిపిన ఆపరేషన్‌లో ఈ భారీ డంప్ దొరికినట్టు చెప్పారు.

Operation Nagni: కశ్మీర్‌లో ఆపరేషన్ నాగ్ని.. భారీగా ఆయుధాల పట్టివేత
Operation Nagni

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని కుప్వారా (kupwara) లో భద్రతా దళాలు కీలకమైన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్‌ నిర్వహించారు. 'ఆపరేషన్ నాగ్ని' (Operataion Nagni) పేరుతో సైన్యం, జమ్మూకశ్మీర్‌ పోలీసులు, బీఎస్ఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఉగ్రస్థావరాన్ని గుర్తించారు. పెద్దఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. కలరూస్ ప్రాంతంలో మూడురోజులుగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు చినార్ కోర్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.

ఉగ్రవాద స్థావరంలో ఒక పిస్తోలు, రెండు మ్యాగ్జైన్‌లు, 12 గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. 370వ అధికరణ రద్దయి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ జరిపిన ఆపరేషన్‌లో ఈ భారీ డంప్ దొరికినట్టు చెప్పారు.

దక్షిణ కశ్మీర్‌లో కుల్గాం జిల్లాలో ఐదురోజులుగా అఖల్ దేవసర్‌లో బలగాలు ప్రత్యేకమైన ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఇంతవరకూ ఒక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టారు. ఇటీవల 'ఆపరేషన్ మహదేవ్‌'లో పహల్గాం ఉగ్రవాదులు ముగ్గురిని భద్రతా బలగాలు మట్టుబెట్టగా, జూలై 30న ఆపరేషన్ శివశక్తిలో ఇద్దరు చొరబాటుదారులను భద్రతా బలగాలు హతమార్చాయి.

ఇవి కూడా చదవండి..

ఆయన ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు.. రాహుల్‌పై మోదీ విసుర్లు

మణిపూర్‌లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన, రాజ్యసభ ఆమోదం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 04:26 PM