Share News

PM Modi: ఆయన ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు.. రాహుల్‌పై మోదీ విసుర్లు

ABN , Publish Date - Aug 05 , 2025 | 03:20 PM

ఆపరేష్ సిందూర్‌పై పార్లమెంటులో విపక్షాలు ప్రశ్నలు లేవెనత్తి తమకు తామే హాని చేసుకున్నాయని ప్రధాని విమర్శించారు. ఇలాంటి మరిన్ని డిబేట్లకు వాళ్లు డిమాండ్ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.

PM Modi: ఆయన ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు.. రాహుల్‌పై మోదీ విసుర్లు
PM Modi

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై విపక్షాలు పార్లమెంటులో చర్చకు పట్టుబట్టి ప్రభుత్వం ముందు నిలవలేక పోయాయని, ఇప్పుడు ఎందుకు చర్చకు పట్టుబట్టామా అని విచారిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోలోకపోయాయని అన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీపై కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మంగళవారంనాడిక్కడ జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు.


ఆపరేషన్ సిందూర్‌పై విపక్షాలు ప్రశ్నలు లేవెనత్తి తమకు తామే హాని చేసుకున్నాయని ప్రధాని విమర్శించారు. 'ఇలాంటి మరిన్ని డిబేట్లకు వాళ్లు డిమాండ్ చేయాలని కోరుకుంటున్నాం. వాటిని సంతోషంగా అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. యావత్ ప్రపంచం వారి ప్రవర్తనను చూసింది. వాళ్లను మనమెందుకు ఆపాలి?' అని మోదీ అన్నారు. కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్‌పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆయన ఎదో ఒకటి చెబుతూనే ఉంటారని, తరచు ఆయన చిన్నపిల్లవాడిలా ప్రవర్తిస్తుంటారని, సుప్రీంకోర్టు కూడా ఆయనను మందలించిందని అన్నారు. యావద్దేశం వాళ్ల ఆకతాయితనాన్ని చూసిందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ప్రశంసిస్తూ, ఇప్పుడు ఆయన సుదీర్ఘకాలంగా హోం మంత్రిగా పని చేసిన క్రెడిట్ దక్కించుకున్నారని అన్నారు.


ఘనస్వాగతం

దీనికి ముందు, పార్లమెంటులో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానమంత్రికి పార్టీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. 'హర్ హర్ మహదేవ్' నినాదాల మధ్య ఆయనను సత్కరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మెడలో దండవేయడంతో ఎంపీలు చప్పట్లు చరుస్తూ సంతోషం వ్యక్తం చేసారు.


ఆపరేషన్ సిందూర్‌పై తీర్మానం

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆపరేషన్ సిందూర్‌పై ఒక తీర్మానాన్ని ఆమోదించారు. 'ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహదేవ్‌‌ను ఎంతో అంకితభావంతో, సాహసంతో చేపట్టిన సాయుధ బలగాలను అభినందిస్తున్నాం. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు వారెంతో అంకితభావంతో త్యాగాలకు వెనుదీయకుండా సేవలదించారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం' అని ఆ తీర్మానం పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసాధారణ, విజనరీ నాయకత్వాన్ని ప్రశంసించింది. కీలక సమయాల్లో దేశానికి సరైన దిశానిర్దేశం చేసేందుకు తీసుకున్న కీలక నిర్ణయాల ద్వారా దేశప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారంటూ కొనియాడింది.


ఇవి కూడా చదవండి..

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత

ఎర్రకోటలో భద్రతా వైఫల్యం.. ఏడుగురు పోలీసుల సస్పెన్షన్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 05:08 PM