Odisha: మైనర్‌పై అత్యాచారం, హత్య..నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Dec 25 , 2025 | 09:10 AM
దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒడిశాలో తీవ్ర విషాధ ఘటన చోటు చేసుకుంది.
భువనేశ్వర్, డిసెంబర్ 25: ఒడిశాలోని భద్రక్ జిల్లా చాంద్‌బలిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. 10 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడటమే కాదు.. దారుణంగా హత్య చేసిన నిందితుడిని ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. స్థానికులు హతపడి, మధుబాబు చాక్, చందబలి ప్రధాన కూడలిలో టైర్లను తగటబెట్టారు. బాలిక మృతదేహంతో నిరసన చేశారు. నిందితుడికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
చాంద్‌బలికి చెందిన బాలిక మంగళవారం స్కూల్‌కి వెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్నేహితులు, బంధువులతో పాటు గ్రామం మొత్తం వెతికారు. ఎక్కడ కూడా బాలిక కనిపించలేదు. దీంతో చాంద్‌బలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం గ్రామానికి దూరంగా చెట్ల పొదలో బాలిక మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భద్రక్ ఎస్పీ మనోజ్ కుమార్ రౌత్ ఈ కేసును సీరియస్‌గా తీసుకొని గంటల వ్యవధిలోనే నిందితుడిని బాబుల్ దాస్ ని జగత్సింగ్‌పూర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. బాలిక కుటుంబ సభ్యులు నిందితుడికి మరణ శిక్ష విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.. ఇప్పటికే ఆందోళనకారులు అతని ఇల్లు కూల్చివేశారు.
ఇవి కూడా చదవండి..
2 రోజుల్లోనే అలర్జీ వచ్చింది.. ఢిల్లీ వాయి కాలుష్యంపై నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6