Share News

Jobs: అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల జాతర..

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:49 AM

రాష్ట్ర అగ్నిమాపక శాఖలో వేలం సంఖ్యలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ శాఖతో పాటు పోలీస్‌ కానిస్టేబుల్‌, యూనిఫార్మ్‌ సర్వీస్‌ కానిస్టేబుల్‌తో కలిపి మొత్తం 3644 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం గురువారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. తమిళనాడు యూనిఫార్మ్‌డ్‌ సర్వీస్‌ సెక్షన్‌ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Jobs: అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల జాతర..

- 3,644 పోస్టుల భర్తీకి చర్యలు

- నేటినుంచి దరఖాస్తుల ఆహ్వానం

చెన్నై: రాష్ట్ర అగ్నిమాపక శాఖలో వేలం సంఖ్యలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ శాఖతో పాటు పోలీస్‌ కానిస్టేబుల్‌, యూనిఫార్మ్‌ సర్వీస్‌ కానిస్టేబుల్‌తో కలిపి మొత్తం 3644 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం గురువారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. తమిళనాడు యూనిఫార్మ్‌డ్‌ సర్వీస్‌ సెక్షన్‌ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీని కోసం రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ యేడాది ఖాళీ పోస్టులను వెల్లడించి భర్తీ చేయనుంది. 2833 సెకండరీ గ్రేడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు, 180 జైలు సిబ్బంది, 631 అగ్నిమాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.


nani3.2.jpg

ఈ పోస్టులకు ఈ నెల 22 నుంచి సెప్టెంబరు 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సెప్టెంబరు 25న దరఖాస్తుల్లో తప్పొప్పుల సవరణకు అనుమతిస్తారు. నవంబరు 11న రాత పరీక్ష జరుగనుంది. కానిస్టేబుల్‌ పోస్టుకు రూ.18,200 నుంచి రూ.67,100 వేతనం ఇస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. జూలై ఒకటో తేదీ నాటికి 18 యేళ్ళు పూర్తయి, 26 యేళ్ళకు మించరాదని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

శాంతిస్తున్న ఉగ్ర గోదావరి

ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 22 , 2025 | 11:56 AM