K Laxman: ఆపరేషన్ సిందూర్ సైనిక పరాక్రమానికి నిదర్శనం
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:01 AM
ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము, కశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. అది ఓర్వలేకనే పాకిస్థాన్ ఏప్రిల్ 22న
రాజ్యసభలో ఎంపీ కె.లక్ష్మణ్
న్యూఢిల్లీ, హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము, కశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. అది ఓర్వలేకనే పాకిస్థాన్ ఏప్రిల్ 22న పర్యాటకులపై దాడి చేసిందని రాజ్యసభలో బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ మన దేశ సైనిక పరాక్రమానికి, ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమనే మోదీ ప్రభుత్వ స్పష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో బుజ్జగింపు విధానాలను అనుసరించిందని విమర్శించారు. రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్‌పై బుధవారం చర్చ జరిగిన సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ పాక్ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి చాలా కచ్చిత్వంతో చేసిన లక్షిత దాడి అని చెప్పారు. హైదరాబాద్ గోకుల్ చాట్‌లో బాంబు పేలుళ్లు సంభవించినప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, అయినా ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం చర్యలు తీసుకొన్న ప్రతీసారి కాంగ్రెస్ పాకిస్థాన్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోందని లక్ష్మణ్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News