Faridabad: గుజరాత్ ఎటీఎస్ వలలో టెర్రరిస్టు.. రామమందిరమే టార్గెట్
ABN , Publish Date - Mar 03 , 2025 | 04:57 PM
ఫరిదాబాద్‌లో అరెస్టయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్‌లను నిర్వీర్వం చేశారు.
న్యూఢిల్లీ: గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) హర్యానాలోని ఫరీదాబాద్‌లోని పాలి ఏరియాలో ఒక టెర్రరిస్టును అరెస్టు చేసింది. అతని నుంచి రెండు గ్రెనేడ్‌లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకుంది. కేంద్ర ఏజెన్సీలు, ఫరీదాబాద్ ఎస్‌టీఎఫ్ సహకారంతో గుజారాత్ ఏటీఎస్ ఈ గాలింపు చర్యలు చేపట్టింది. రామమందిరంపై దాడి చేయడం టెర్రరిస్టు టార్గెట్‌లలో ఒకటిగా ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
Ranveer Allahbadia: అల్హాబాదియాకు సుప్రీంలో ఊరట.. ప్రసారాలకు అనుమతి
ఫరిదాబాద్‌లో అరెస్టయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్‌లను నిర్వీర్వం చేశారు. రెహ్మా్న్‌కు టెర్రరిస్టు సంస్థలతో ఉన్న సంబంధం, అతని టార్గెట్‌కు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు అతన్ని గుజరాత్‌కు తరలిస్తు్న్నారు. రెహ్మాన్ అరెస్టుతో భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నమైనట్టు చెబుతున్నారు. కాగా, గుజరాత్ ఏటీఎస్ చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి
MK Stalin: కొత్త దంపతులు వెంటనే పిల్లల్ని కనండి
Mamata Banerjee: డూప్లికేట్ ఎపిక్ నంబర్లు ఉంటే.. నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు!
Raksha Khadse: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.