Supreme Court: వక్ఫ్‌పై సుదీర్ఘ విచారణ అవసరం
ABN , Publish Date - May 06 , 2025 | 03:55 AM
వక్ఫ్ సవరణ చట్ట రాజ్యాంగబద్ధతపై దాఖలైన 72 పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ అవసరమని అభిప్రాయపడింది. తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపడుతుందని పేర్కొంది
న్యూఢిల్లీ, మే 5 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అభిప్రాయపడ్డారు. దాఖలైన 72 పిటిషన్లపై విచారణను తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం చేపడుతుందని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని తెలిపారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ ధర్మాసనం నిర్ణయంపై తాము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయదలుచుకోలేదని అన్నారు. ఈ నెల 13న సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేయనున్నారు. 14న తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..