Share News

Kangana Ranaut Petition Dismissed: సుప్రీంలో నటి కంగనాకు బిగ్ షాక్

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:34 PM

నటి కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. రైతుల నిరసనలపై తాను చేసిన వివాదాస్పద ట్వీట్‌కు సంబంధించి..

Kangana Ranaut Petition Dismissed: సుప్రీంలో నటి కంగనాకు బిగ్ షాక్
Kangana Ranaut Petition Dismissed

న్యూఢిల్లీ: నటి కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. రైతుల నిరసనలపై వివాదాస్పద ట్వీట్‌కు సంబంధించి పంజాబ్‌లో నమోదైన కేసును కొట్టివేయాలన్న ఆమె పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలపై కంగనా గతంలో ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్ రైతుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటూ, పంజాబ్‌లో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు అయింది.


ఆ కేసును రద్దు చేయాలంటూ కంగనా హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. కానీ, కోర్టు ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం ఆమె హర్యానా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, అక్కడ కూడా ఆమెకు ఊరట దక్కలేదు. కంగనా పిటిషన్‌‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అప్పటికే ఉద్రిక్తతలో ఉన్న పరిస్థితికి కంగనా తన ట్వీట్‌తో అగ్నికి ఆజ్యం పోశారంటూ ధర్మాసనం కంగనా పిటిషన్‌ను తోసిపుచ్చింది.


కాగా, 2021లో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా మహిందర్‌ కౌర్‌ అనే వృద్ధ మహిళను కించపర్చేలా నటి కంగనా ట్వీట్‌ చేశారు. ఆమె రూ. 100 కిరాయికి వస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహిందర్‌ కౌర్‌ కంగనాపై పరువునష్టం కేసు వేశారు. దాంతో కౌర్‌ ఫిర్యాదును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కంగనా పిటిషన్ దాఖలు చేశారు. కానీ, సుప్రీం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

Also Read:

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మహిళా మంత్రి.. కారణమేంటో తెలిస్తే..

ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు

For More Latest News

Updated Date - Sep 12 , 2025 | 01:49 PM