Share News

YouTuber Ranveer : అభ్యంతరకర వ్యాఖ్యల కేసుల్లో... రణవీర్‌ను అరెస్టు చేయొద్దు

ABN , Publish Date - Feb 19 , 2025 | 04:43 AM

తల్లిదండ్రులపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్‌ రణవీర్‌ను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ఆయనపై కొత్త కేసులు నమోదు చేయకూడదని

YouTuber Ranveer : అభ్యంతరకర వ్యాఖ్యల కేసుల్లో... రణవీర్‌ను అరెస్టు చేయొద్దు

కొత్త కేసులు వద్దు.. సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: తల్లిదండ్రులపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్‌ రణవీర్‌ను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ఆయనపై కొత్త కేసులు నమోదు చేయకూడదని ఆదేశించింది. అదేసమయంలో ఆయనను తీవ్రంగా మందలించింది. ఆ వ్యాఖ్యలు ఆయన ‘వికృత మనస్తత్వాన్ని’ చూపిస్తున్నాయని విమర్శలు చేసింది. ఇటీవల ‘ఇండియాస్‌ గాట్‌ లేటెంట్‌’ కామెడీ షోలో రణవీర్‌ జడ్జిగా పాలొన్నారు. ఆ సమయంలో ఆయన తల్లిదండ్రుల శృంగారానికి సంబంధించిన ప్రశ్న వేశారు. దీంతో, వీక్షకులు భగ్గుమన్నారు. ఆయనపై అస్సాం సహా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దాంతో అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్‌ను పరిశీలించగానే అల్లాహాబాదియాపై ధర్మాసనం మండిపడింది. ఆ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావంటునే ‘‘ఆయన మనసులో చెత్త ఉంది. దాన్నంతా యూట్యూబ్‌ షోలో కక్కేశారు’’ అని వ్యాఖ్యానించింది. ‘‘పాపులారిటీ ఉందని ఏదైనా మాట్లాడేస్తారా, ఎవరైనా ఇలాంటి భాషను ఇష్టపడుతారా’’ అని అడిగింది. ‘‘వాక్‌ స్వాతంత్య్రం పేరుతో సమాజం విలువలకు వ్యతిరేకంగా మాట్లాడే లైసెన్స్‌ ఏ ఒక్కరికీ లేదు’’ అని స్పష్టం చేసింది. రన్‌వీర్‌ పాస్‌పోర్టును ఠాణె పోలీసు స్టేషన్‌లో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని పేర్కొంది. ఈ కామెడీ షోకు సంబంధించిన ఇతర ఎపిసోడ్లను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రసారం చేయకూడదని తెలిపింది.


ఇవి కూడా చదవండి:

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..


Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..


New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 19 , 2025 | 04:43 AM