Share News

Supreme Court Said Use Arattai: అరట్టై వాడండి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:48 PM

వాట్సాప్‌ అకౌంట్ పునరుద్ధరణకు సంబంధించి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దానిపై శనివారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court Said Use Arattai: అరట్టై వాడండి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court

నేటికాలంలో వాట్సాప్ గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ లో ఈ ఫీచర్ తప్పనిసరిగా ఉంటుంది. ఇక కొందరు అయితే తెల్లవారింది మొదలు.. పడుకునే వరకూ వాట్సాప్ చాట్ లో మునిగి తేలుతుంటారు. అయితే ఇటీవల విదేశీ వస్తువులు, ఫీచర్లను వాడొద్దనే నినాదం పెరిగింది. ఈ క్రమంలోనే వాట్సాప్‌కు పోటీగా స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌ ‘అరట్టై’ వచ్చింది. ప్రస్తుతం దీని పేరు నెట్టింట మార్మోగుతోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ అరట్టై గురించి ప్రస్తావన వచ్చింది. మరి.. ఏ సందర్బంలో వచ్చింది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


వాట్సాప్‌ అకౌంట్ పునరుద్ధరణకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court)లో ఓ పిటిషన్ దాఖలైంది. దానిపై శనివారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్‌ (WhatsApp) లేకపోతే ఏం.. అరట్టై వాడొచ్చు కదా అని సూచించింది. తన ఖాతాను వాట్సాప్‌ బ్లాక్‌ చేసిందని, దాన్ని పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court)లో ఓ వ్యక్తి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. సోషల్ మీడియాలో ఉన్నట్టుండి ఇలా అకౌంట్లను నిషేధించకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్‌ సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరాడు. దీనిపై న్యాయస్థానం కూడా ఒకింత అసహనం వ్యక్తం చేసింది. వాట్సాప్‌ యాక్సెస్‌ ఉండటం ప్రాథమిక హక్కు ఎలా అవుతుంది? అని ప్రశ్నించింది.


పిటిషనర్‌ ఓ డయాగ్నిక్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడని, వాట్సప్‌లోనే తన క్లయింట్‌లతో టచ్‌లో ఉన్నారని, ఉన్నట్టుండి ఆ ఖాతాను బ్లాక్‌ చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది బదులిచ్చాడు. దీనిపై ధర్మాసనం (Supreme Court) స్పందిస్తూ.. కమ్యూనికేషన్‌ కోసం ఇతర యాప్‌లు కూడా ఉన్నాయని, వాటిని ఉపయోగించొచ్చు కదా..! అని ప్రశ్నించింది. ఈ మధ్యే స్వదేశీ యాప్‌ ‘అరట్టై’(Arattai) కూడా వచ్చింది. దాన్ని వాడుకోండని సూచించింది. దీనిపై ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. సుప్రీంకోర్టు(Supreme Court) చేసిన వ్యాఖ్యలకు కంగుతిన్న పిటిషనర్.. కోర్టు అనుమతితో తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి..


Bihar Assembly Elections: 100 సీట్లలో ఏఐఎంఐఎం పోటీ

నార్సింగి డ్రగ్స్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2025 | 08:00 PM