Super Moon: సూపర్ మూన్.. కనువిందు..
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:18 PM
కార్తీక పౌర్ణమి వేళ.. సూపర్ మూన్ ఏర్పడింది. బుధవారం సాయంత్రం 6.49 గంటలకు కనిపించింది. అయితే మాములుగా కంటే.. చంద్రుడు 13 శాతం అధికంగా.. 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తోంది.
న్యూఢిల్లీ, నవంబర్ 05: ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఈ నేపథ్యంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. నవంబర్ 5వ తేదీ ఆకాశంలో చంద్రుడు సాధారణంగా కంటే పెద్దగా.. మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. బుధవారం సాయంత్రం సరిగ్గా 6.49 గంటలకు చందమామ ఈ కనువిందు చేశాడు. దీనినే బీవర్ సూపర్ మూన్ అని పిలుస్తారు.
పౌర్ణమి సమయంలో చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత సమీపంలోకి చేరడంతో ఈ అద్భుతం జరిగింది. ఈ సూపర్ మూన్ వేళ.. చంద్రుడు మాములు కంటే 13 శాతం పెద్దగా.. 30 శాతం ప్రకాశవంతంగా కనిపించాడు. ఈ సారి భూమికి చంద్రుడు మరింత దగ్గరగా వచ్చాడు. ఈ సూపర్ మూన్ ఈ ఏడాదిలో ఏర్పడిన రెండోది.
చంద్రుడు.. భూమి చుట్టూ తిరిగే కక్ష్య పూర్తిగా వృత్తాకారంలో ఉండదు. కానీ కక్ష్యలో తిరిగే సమయంలో భూమికి చంద్రుడు దగ్గరగా.. దూరంగా వెళ్తుంటాడు. ఈ పౌర్ణమి వేళ.. చంద్రుడు తన కక్ష్యలో భూమికి సమీపానికి వచ్చినప్పుడు సూపర్ మూన్ అని పిలుస్తారు. ఈ సమయంలో భూమికి చంద్రుడు దాదాపు 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఈ నేపథ్యంలో సాధారణ పౌర్ణమి కంటే చంద్రుడు పెద్దగా కనిపించాడు. చంద్రుడు చేరుకునే సమయంలో భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యకు సమీపంలో ఉన్న పెరజీ వద్ద సూపర్ మూన్ సంభవిస్తోంది.
ఇవి కూడా చదవండి..
రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 25 లక్షల దొంగ ఓట్లంటూ..
ఎస్ఐఆర్‌ను మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా.. రాహుల్ ఆరోపణలపై ఈసీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి