Shah Rukh Khan: షారుఖ్ కు షాక్.. సమన్లు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు!
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:36 PM
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు బుధవారం ఢిల్లీ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో షారూఖ్‌కు సంబంధించిన రెడ్ చిల్లీస్ సంస్థకు హైకోర్టు సమన్లు జారీ చేసింది.
ముంబై, అక్టోబర్ 08: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు బుధవారం ఢిల్లీ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో షారూఖ్‌కు సంబంధించిన రెడ్ చిల్లీస్ సంస్థకు హైకోర్టు సమన్లు జారీ చేసింది. రెడ్ చిల్లీస్ సంస్థతో పాటు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్, మరికొందరికి ఈ సమన్లు జారీ అయ్యాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇతర ప్రతివాదులు ఏడు రోజుల్లోగా తమ సమాధానాలను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అలానే పిటిషన్ కాపీలను తమకు అందించాలని వాంఖడేను కూడా ఆదేశించింది. అలానే ఈ కేసు అక్టోబర్ 30నకు వాయిదా వేసింది.
రెడ్ చిల్లీస్, నెట్ ఫ్లిక్స్ లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముంబై జోనల్ డైరెక్టర్, IRS అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టులో పరువు నష్ట దావా వేశారు. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్ 'ది బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్' తన ప్రతిష్టను దిగజార్చిందని వాంఖడే పిటిషన్‌లో పేర్కొన్నారు. వాంఖడే తన పిటిషన్‌లో నటుడు షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ ఓనర్లుగా ఉన్న రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, ఇతరుల పేర్లను పేర్కొన్నారు. వారి నుంచి రూ. 2 కోట్ల నష్టపరిహారాన్ని ఆయన కోరారు. ఆ మొత్తాన్ని క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇవ్వాలని వాంఖేడ్ తన పిటిషన్‌లో కోరారు.
Also Read:
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ఫ్రైజ్..
మాజీ సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్..
అభ్యర్థుల ఖరారుకు బీజేపీ కీలస సమావేశం