Share News

Shilpa Shetty Foreign Trip: శిల్పా శెట్టికి షాక్.. విదేశాలకు వెళ్లాలంటే రూ.60కోట్లు కట్టాల్సిందే..

ABN , Publish Date - Oct 08 , 2025 | 05:21 PM

అక్టోబర్‌ 25 నుంచి 29 వరకూ కొలంబోలో జరిగే ఓ యూట్యూబ్‌ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లాలని.. అందుకు అనుమతి ఇవ్వాలని శిల్పా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది.

Shilpa Shetty Foreign Trip: శిల్పా శెట్టికి షాక్.. విదేశాలకు వెళ్లాలంటే రూ.60కోట్లు కట్టాల్సిందే..
Shilpa Shetty

ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి(Shilpa Shetty)కి బాంబే హైకోర్టు షాకిచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు హైకోర్టు ధర్మాసనం పరిష్మన్ ఇవ్వలేదు. ఒకవేళ వెళ్లాలంటే ముందుగా రూ.60 కోట్లు చెల్లించండంటూ బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ బిజినెస్ మెన్ ను రూ.60కోట్ల మేరకు మోసం చేసినట్లు నమోదైన కేసులో శిల్పాశెట్టి, ఆమె భర్త, ప్రముఖ వ్యాపార వేత్త రాజ్ కుంద్రా నిందితులుగా ఉన్నారు.

ఈ కేసుకు సంబంధించి ముంబై ఎకానమిక్ అఫెసెస్ వింగ్(EOW) దర్యాప్తు చేస్తోంది. కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై ఇటీవలే ఈవోడబ్ల్యూ అధికారులు కౌట్‌ నోటీసులూ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వారు విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి లేదా దర్యాప్తు అధికారుల పర్మిషన్ తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో శ్రీలంక వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ శిల్పా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.


అక్టోబర్‌ 25 నుంచి 29 వరకూ కొలంబోలో జరిగే ఓ యూట్యూబ్‌ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లాలని.. అందుకు అనుమతి ఇవ్వాలని శిల్పా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. విదేశీ ప్రయాణ అనుమతి కోరే ముందు రూ.60 కోట్లు చెల్లించండంటూ వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.


ఇదిలా ఉంటే రూ.60కోట్ల మేరకు మోసం కేసులో శిల్పా శెట్టిని ముంబై పోలీసులు రెండ్రోజుల క్రితం విచారించింది. సోమవారం ఆమె ఇంటికి వెళ్లిన అధికారులు.. దాదాపు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా శిల్పా శెట్టి నుంచి కీలక విషయాలను రాబట్టినట్లు టాక్. విచారణ సందర్భంగా ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అలానే ఆమె పలు పత్రాలను అందజేసినట్లు పేర్కొన్నారు.


Also Read:

స్టార్ కమెడియన్ అరెస్ట్.. కారణం తెలిస్తే ఛీ కొడతారు..

నగరంలో క్లైమేట్‌ ఛేంజ్‌..

భారత పర్యటనపై బ్రిటన్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Oct 08 , 2025 | 06:41 PM