Shashi Tharoor : కాంగ్రెస్‌కు ఝలక్.. కేంద్ర బిల్లును స్వాగతించిన శశిథరూర్
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:32 PM
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి స్వంత పార్టీకి ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు వ్యతిరేకిస్తున్నా శశిథరూర్ మాత్రం బీజేపీ సర్కారు కొత్తగా తెచ్చిన బిల్లును స్వాగతిస్తున్నారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి స్వంత పార్టీకి ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు వ్యతిరేకిస్తున్నా శశిథరూర్ మాత్రం బీజేపీ సర్కారు కొత్తగా తెచ్చిన బిల్లును స్వాగతించారు. మంచి బిల్లు అంటూ కితాబిచ్చారు. ఇవాళ లోక్‌సభలో మోదీ సర్కారు కొత్తగా మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరసగా 30 రోజులపాటు కస్టడీలో ఉంటే ప్రధానమంత్రినైనా, కేంద్ర మంత్రినైనా, ముఖ్యమంత్రులనైనా పదవి నుంచి తొలగించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
ఈ బిల్లుని విపక్ష పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఈ బిల్లును క్రూరమైందిగా అభివర్ణించారు. అన్యాయంగా ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తే పరిస్థితి ఏంటన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ప్రియాంక వ్యతిరేకిస్తే, అదే పార్టీకి చెందిన శశిథరూర్ మాత్రం ఇది మంచి బిల్లు అంటూ స్వాగతించారు. అంతేకాదు, ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన అంశం అన్నారు.
ఈ బిల్లును మరింత అధ్యయనం చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపే అంశం మీద కూడా శశిథరూర్ పాజిటివ్‌గా స్పందించారు. అది ఎంతో మంచి విషయమని.. మన ప్రజాస్వామ్యానికి ఎంతో మేలు చేస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి
లోక్‌సభ ముందుకు కీలక బిల్లులు.. బిల్లు ప్రతులను చించి పడేసిన ప్రతిపక్ష ఎంపీలు..
For National News And Telugu News