Rahul Gandhi: రాహుల్‌ను హిందూమతం నుంచి బహిష్కరించిన శంకరాచార్య
ABN , Publish Date - May 06 , 2025 | 08:53 PM
కంఖాల్‌లోని శంకరాచార్య మఠంలో అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ, ఈ విషయంలో క్షమాపణ చెప్పాలంటూ రాహుల్ గాంధీకి తాము నోటీసు కూడా ఇచ్చామని, అయితే తమకు ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు.
కంఖాల్: మనుస్మృతిపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నట్టు ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి మంగళవారంనాడు ప్రకటించారు. సనాతన ధర్మానికి మనుస్మృతి పునాది అని, లోక్‌సభలో మనుస్మృతిని కించపరుస్తూ రాహుల్ వ్యాఖ్యలు చేసారని ఆయన తెలిపారు.
IAF Air Exercise NOTAM Issued: సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం
కంఖాల్‌లోని శంకరాచార్య మఠంలో అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ, ఈ విషయంలో క్షమాపణ చెప్పాలంటూ రాహుల్ గాంధీకి తాము నోటీసు కూడా ఇచ్చామని, అయితే తమకు ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. దీంతో లాంఛనంగా ఆయనను హిందూమతం నుంచి శంకరాచార్య మఠం బహిష్కరిస్తున్నట్టు తెలిపారు.
రాహుల్ గాంధీ ఈ ఏడాది మొదట్లో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో బీజేపీపై విరుచుకుపడుతూ, ఆ పార్టీ నేతలు మనుస్మృతిని అనుసరిస్తారని, భారత రాజ్యాంగాన్ని కాదని అన్నారు. హథ్రాస్‌లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని తాను కలుసున్న విషయాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబ సభ్యులు ఇల్లు విడిచి బయటకు వెళ్లలేకపోతున్నారని, నిందితులు మాత్రం రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. ''నిందితులు రోడ్లపై స్వేచ్ఛగా తిరగవచ్చని రాజ్యాంగంలో ఎక్కడ రాసుంది? ఇది మీ పుస్తకం మనస్మృతిలో ఉంది'' అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
PM Modi: బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రకం: మోదీ
Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..