Elephant: 12 మందిని చంపిన అడవి ఏనుగు కోసం గాలింపు
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:59 AM
నీలగిరి జిల్లా కూడలూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 12 మందిపై దాడిచేసి హతమార్చిన అడవి ఏగును బందించాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రాకేష్ కుమార్ డోగ్రా ఆదేశించారు.
చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లా కూడలూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 12 మందిపై దాడిచేసి హతమార్చిన అడవి ఏగును బందించాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రాకేష్ కుమార్ డోగ్రా(Principal Chief Conservator of Wildlife Rakesh Kumar Dogra) ఆదేశించారు. జిల్లాలోని కూడలూరు, పందలూరు(Pandalur), సేరంపాడి, పాడన్‌దురై, దేవల్ సహా పలు ప్రాంతాల్లోని జనావాసాలకు ఆహారం కోసం అడవుల నుంచి వస్తున్న ఏనుగులు, ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేయడంతో పాటు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి.

గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా అడ్డుకోవాలంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో, కూడలూరు రేంజ్ పరిధిలో 12 మందిపై దాడిచేసి హతమార్చిన ఏనుగును బంధించాలని అటవీ శాఖ ఉత్తర్వులు జారీచేయడంతో ఆ శాఖాధికారులు ఆ ఏనుగు కోసం వేట ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?
సిందూర్ తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం
Read Latest Telangana News and National News