Supreme Court on Bihar SIR: క్లెయిమ్స్ దాఖలుకు గడువు పొడిగించేది లేదన్న సుప్రీం
ABN , Publish Date - Sep 01 , 2025 | 02:43 PM
గడువు పొడిగించడం వల్ల ఇది 'ముగింపులేని ప్రక్రియ'గా మారే అవకాశం ఉందని, నిబంధనల ప్రకారం నిర్దేశించిన మొత్తం షెడ్యూల్ పట్టాలు తప్పే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ (SIR) కింద క్లెయిమ్స్, అభ్యంతరాల సమర్పణకు ఈసీఐ (ECI) విధించిన సెప్టెంబర్ 1వ తేదీ గడువును పొడిగించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు నిరాకరించింది. ఈ ప్రక్రియకు రాజకీయ పార్టీలు చురుకుగా సహకరించాలని ఆదేశించింది.
సెప్టెంబర్ 1వ తేదీ తరువాత కూడా అభ్యంతరాలు ఏవైనా ఉంటే సమర్పించవచ్చని, అర్హమైన దరఖాస్తులు ఉంటే ఎన్నికల జాబితా ఫైనలేజ్ చేసేంతవరకూ పరిశీలించగలమని విచారణ సందర్భంగా కోర్టుకు ఈసీఐ తెలిపింది. అలాంటి క్లెయిమ్స్‌ను నామినేష్ల దాఖలుకు చివరి రోజు వరకూ పరిశీలించగలమని, అర్హమైన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చగలమని పేర్కొంది.
అయితే కమిషన్ సబ్మిషన్‌పై కోర్టు స్పందిస్తూ, గడువు పొడిగించడం వల్ల ఇది 'ముగింపులేని ప్రక్రియ'గా మారే అవకాశం ఉందని, నిబంధనల ప్రకారం నిర్దేశించిన మొత్తం షెడ్యూల్ పట్టాలు తప్పే ప్రమాదం ఉందని పేర్కొంది. కాగా, డాక్యుమెంట్లు అసంపూర్తిగా ఉన్న వారికి ఏడు రోజుల్లోగా నోటీసులు పంపుతామని కోర్టుకు ఈసీ తెలిపింది. ఇంతవరకూ ముసాయిదా ఎన్నికల జాబితాలోని 99.5 శాతం ఓటర్లు ఎలిజిబిలిటీ డాక్యుమెంట్లు సమర్పించినట్టు వివరించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగాంగా క్లెయిమ్స్, అభ్యంతరాలను తెలియజేసేందుకు గడువును పొడిగించాలని ఆర్జేడీ, ఏఐఎంఐఎం దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ జరిపింది.
ఇవి కూడా చదవండి..
నేటి నుంచి వెండి ఆభరణాలపైనా హాల్‌మార్క్ తప్పనిసరి, సిల్వర్ ఇక మరింత ప్రియం?
ఈ రోజు నుంచి కొత్త రూల్స్.. సిలిండర్ ధరలు, రిజిస్టర్డ్ పోస్ట్.. మారేవి ఇవే..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..