Hallmark : నేటి నుంచి వెండి ఆభరణాలపైనా హాల్‌మార్క్ తప్పనిసరి, సిల్వర్ ఇక మరింత ప్రియం?
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:32 PM
నేటి నుంచి దేశంలో వెండి ఆభరణాలు, వస్తువులపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేస్తూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఈ నిబంధన ప్రకారం, వెండి ఆభరణాలపై BIS లోగో, శుద్ధత స్థాయి, అస్సేయింగ్ సెంటర్ గుర్తు, జ్యువెలర్ గుర్తు, ఇంకా..
ఇంటర్నెట్ డెస్క్ : నేటి నుంచి (2025 సెప్టెంబర్ 1), భారతదేశంలో వెండి ఆభరణాలు, వస్తువులపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేస్తూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఈ నిబంధన ప్రకారం, వెండి ఆభరణాలపై BIS లోగో, శుద్ధత స్థాయి (800, 835, 900, 925, 970, 990), అస్సేయింగ్ సెంటర్ గుర్తు, జ్యువెలర్ గుర్తు, ఇంకా 6 అంకెల హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) కోడ్ ఉండాలి. ఈ నియమం బంగారు ఆభరణాలకు ఇప్పటికే అమల్లో ఉంది. ఇప్పుడు వెండి మార్కెట్‌లో పారదర్శకత, నాణ్యతను నిర్ధారించడానికి కొత్తగా హాల్ మార్క్ విధానాన్ని తీసుకువచ్చారు.
ఈ హాల్‌మార్కింగ్ వల్ల వినియోగదారులకు వెండి శుద్ధతపై నమ్మకం పెరుగుతుంది. మోసాలు తగ్గుతాయి అదే సమయలో వెండి, ఆభరణాల రీసేల్ విలువ మెరుగుపడుతుంది. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం హాల్‌మార్కింగ్ ప్రక్రియ వల్ల వెండి ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పరీక్షా రుసుము, అనుబంధ ఖర్చులు దీనికి జోడించబడ్డమే కారణం.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు.. నవ్యాంధ్ర ప్రగతికి తొలిబాట వేసిన కార్యశూరుడు: ధూళిపాళ్ల నరేంద్ర
మంత్రి నారా లోకేష్‌కు మరో అరుదైన గౌరవం
For More AP News And Telugu News