Share News

New Rules from Sept 1: ఈ రోజు నుంచి కొత్త రూల్స్.. సిలిండర్ ధరలు, రిజిస్టర్డ్ పోస్ట్.. మారేవి ఇవే..

ABN , Publish Date - Sep 01 , 2025 | 09:47 AM

మరో కొత్త నెల వచ్చేసింది. సెప్టెంబర్ నెల ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కీలక మార్పులు వినియోగదారులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేయనున్నాయి.

New Rules from Sept 1: ఈ రోజు నుంచి కొత్త రూల్స్.. సిలిండర్ ధరలు, రిజిస్టర్డ్ పోస్ట్.. మారేవి ఇవే..
new rules September 2025

మరో కొత్త నెల వచ్చేసింది. సెప్టెంబర్ నెల ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు, రిజిస్టర్డ్ పోస్ట్‌ను స్పీడ్ పోస్ట్‌తో విలీనం చేయడం, వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్, మోసపూరిత కాల్‌లపై చర్యలు వంటి అనేక కీలక మార్పులు వినియోగదారులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేయనున్నాయి (New rules September 2025).


రిజిస్టర్డ్ పోస్ట్‌కు వీడ్కోలు (Registered post discontinued)..

ఇండియా పోస్ట్ తన ఐకానిక్ రిజిస్టర్డ్ పోస్ట్ సేవను సెప్టెంబర్ 1, 2025 నుంచి రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రిజస్టర్డ్ పోస్ట్‌కు ఆదరణ తగ్గడం, వినియోగం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్‌ను స్పీడ్ పోస్ట్ సర్వీస్‌తో విలీనం అవుతుంది.

ఎల్‌పీజీ సిలిండర్ ధరల తగ్గుముఖం (LPG price cut September 1)..

వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు రూ. 51.50 తగ్గాయి. ఈ ధరలు సెప్టెంబర్ 01 నుంచి అమలులోకి వస్తాయి. ఢిల్లీలో, 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర సెప్టెంబర్ 1 నుంచి రూ. 1580 అవుతుంది. అయితే14.2 కిలోల గృహ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు.


వెండికి కొత్త హాల్‌మార్కింగ్ (Silver hallmarking rules)..

వెండికి కూడా బంగారం లాగానే హాల్‌మార్కింగ్ నియమాలు సెప్టెంబర్ 01 నుంచి అమలవుతాయి. వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న వెండి ఆభరణాల స్వచ్ఛత, నాణ్యతను అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది. వెండి ఆభరణాలకు.. 900, 800, 835, 925, 970, 990 స్వచ్ఛతను సూచించే ప్రత్యేక 6 అంకెల హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID)తో హాల్‌మార్క్ చేయనున్నారు.

స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యలు..

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సెప్టెంబర్ 01 నుంచి స్పామ్, మోసపూరిత కాల్‌లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. స్పామ్ కాల్స్ లేదా స్పామ్ మెసేజ్‌లతో వినియోగదారులను వేధించే సంస్థలను అన్ని ఆపరేటర్లు రెండేళ్ల వరకు బ్లాక్‌లిస్ట్ చేస్తారని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

బంగారం ధరలకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వర్షంలో ఆడుతుండగా ఊహించని సంఘటన.. గ్రౌండ్‌లో పడ్డ పిడుగు..


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 01 , 2025 | 09:47 AM