Supreme Court Notice On Ram Setu: రామసేతుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు
ABN , Publish Date - Aug 29 , 2025 | 07:29 PM
రామసేతుకు సకాలంలో జాతీయ స్మారక చిహ్నం హోదా కల్పించాలని కోరుతూ తన రిప్రజెంటేషన్ 2023 నుంచి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని, మేలో మరోసారి కోరినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని స్వామి తన పిటిషన్‌లో తెలిపారు.
న్యూఢిల్లీ: రామసేతు (Ram Setu)ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నం (Manument of national importence)గా గుర్తించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
రామసేతుకు సకాలంలో జాతీయ స్మారక చిహ్నం హోదా కల్పించాలని కోరుతూ తన రిప్రజెంటేషన్ 2023 నుంచి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని, మేలో మరోసారి కోరినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని స్వామి తన పిటిషన్‌లో తెలిపారు. రామసేతును దుర్వినియోగం చేయడం, రూపుమార్చకుండా పరిరక్షించాల్సి బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్వామి తరఫున హాజరైన న్యాయవాది విభా మఖిజా అన్నారు. రామసేత ప్రదేశం పలువురు నమ్మకాలతో ముడిపడి ఉందని వాదించారు.
పురాతన కట్టడాలు, ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 ప్రకారం రామసేతను నేషనల్ మాన్యుమెంట్‌గా ప్రకటించాలని తాను దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వ సమాధానం కోరుతూ 2023లో కోర్టు ఆదేశాలిచ్చిందని స్వామి కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత తాను 2023, 2025లో ప్రభుత్వానికి రెండు రిప్రజెంటేషన్లు పంపినప్పటికీ ఈ అంశం విచారణకు రాలేదని చెప్పారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఈ పిటిషన్‌లో చేర్చాలని కోరారు. తద్వారా రామసేతుకు సకాలంలో జాతీయ స్మారక చిహ్నం హోదా కల్పించాలని కోర్టుకు విన్నవించారు.
ఇవి కూడా చదవండి..
ఆయన తలనరికి టేబుల్‌పై పెట్టాలి... మహువా మొయిత్ర సంచలన వ్యాఖ్యలు
మోదీ తల్లిపై వ్యాఖ్యలు.. జెండా కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి