Mahakumbh: సనాతన ధర్మం వటవృక్షం.. పొదలతో పోల్చకూడదు: యోగి
ABN , Publish Date - Jan 25 , 2025 | 06:11 PM
మహాకుంభ్‌లో అన్నపానాదులు, బసకు ఎలాంటి కొరతా లేదని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. సామరస్యం, కరుణ, అందరూ ఒక్కటేనన్న సందేశాన్ని మహాకుంభ్ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పనున్నామని తెలిపారు.

ప్రయాగ్‌రాజ్: సనాతన ధర్మాన్ని (Sanatan Dharma) వటవృక్షం (Banyan tree)గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అభివర్ణించారు. ఇతర పొదల (Bushes)తో దానిని పోల్చరాదని అన్నారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో విశ్వ హిందూ పరిషత్ (VHP) ఏర్పాటు చేసిన సంత్ సమ్మేళన్‌లో ఆయన మాట్లాడుతూ, తీర్మానాలు కార్యరూపంలోకి రావాలంటే ఓర్పు అవసరమని, ఓర్పులేకుంటే ఏమీ సాధించలేమని అన్నారు. 'సనాతన్' అనేది ఒక పెద్ద వటవృక్షమని, చిన్నచిన్న పొదలతో దానితో పాల్చరాదని సూచించారు.
Delhi Elections: బీజేపీ మూడవ 'సంకల్ప్ పాత్ర'ను విడుదల చేసిన అమిత్‌షా
మహాకుంభమేళాలో అతిపెద్ద సంత్ సమ్మేళన్ నిర్వహించిన వీహెచ్‌పీ కృషిని యోగి ఆదిత్యనాథ్ అభినందించారు. ''మహాకుంభ్ నగర్‌లో భారతదేశ సనాతన సంప్రదాయాన్ని యావత్ ప్రపంచం వీక్షించింది. ఇంతపెద్ద ఈవెంట్‌ను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన వీహెచ్‌కి, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అయోధ్యలో రాముల వారి ప్రతిష్ట కోసం 500 ఏళ్ల వేచిచూశాం. ఎట్టకేలకు అయోధ్యకు రాముడు తిరిగివచ్చిన విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి'' అని అన్నారు.
విశ్వసనీయత, అధునికత మేళవించిన మహాకుంభ్‌ను ఇప్పుడు మనమంతా చూస్తున్నామని ఆదిత్యనాథ్ అన్నారు. '' సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ గత ఏడాది 500 ఏళ్ల నిరీక్షణకు తెరపడి, అయోధ్యలో భవ్యరామాలయ నిర్మాణం జరగడం చూశారు. యావత్ ప్రపంచం వీక్షించింది. 2016లో 2 లక్షల 36 వేల మంది భక్తులు అయోధ్యను సందర్శించే 2024లో ఆ సంఖ్య 10 నుంచి 12 కోట్లకు చేరుకుంది'' అని తెలిపారు.
మహాకుంభ్‌కు 45 కోట్ల మంది..
గత పది రోజుల్లో 10 కోట్ల మంది భక్తులు మహాకుంభ్‌లో పవిత్ర స్నానాలు ఆచరించారని, రాబోయే 35 రోజుల్లో ఈ సంఖ్య 45 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభ్ ఆధ్యాత్మిక కార్యక్రమం ఐక్యతా సందేశాన్ని చాటుతోందని, ప్రపంచంలోని నలుమూలల ప్రజలను మహాకుంభ్‌కు ఆహ్వానించామని చెప్పారు. ఇక్కడ అన్నపానాదులు, బసకు ఎలాంటి కొరతా లేదని చెప్పారు. సామరస్యం, కరుణ, అందరూ ఒక్కటేనన్న సందేశాన్ని మహాకుంభ్ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పనున్నట్టు యోగి తెలిపారు.
ఇవి కూడా చదవండి