Sabarimala: శబరిమలకు చేరుకున్న ద్వారపాలక విగ్రహ తాపడాలు
ABN , Publish Date - Sep 21 , 2025 | 08:40 PM
విగ్రహ తాపడాలు మరమ్మతు అనంతరం తిరిగి సన్నిధానం చేరుకున్నాయని, సంబంధిత తాంత్రి పూజాదికాలు నిర్వహించిన అనంతరం విగ్రహాలకు వాటిని అమర్చడం జరుగుతుందని టీడీబీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.
తిరువనంతపురం: స్వామి అయ్యప్ప కొలువుదీరిన శబరిమల (Sabarimala) ద్వారపాలక (Dwarapalaka) విగ్రహ తాపడాలు చెన్నై నుంచి మరమ్మతు అనంతరం తిరిగి అయ్యప్ప సన్నిధికి ఆదివారంనాడు చేరుకున్నాయి. ఈ విషయాన్ని ట్రావెన్‌కోర్ దేవస్వాం బోర్డు (TDB) వెల్లడించింది. ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు ఇటీవల తీవ్రంగా పరిగణించడం, విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
విగ్రహ తాపడాలు మరమ్మతు అనంతరం తిరిగి సన్నిధానం చేరుకున్నాయని, సంబంధిత తాంత్రి పూజాదికాలు నిర్వహించిన అనంతరం విగ్రహాలకు వాటిని అమర్చడం జరుగుతుందని టీడీబీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.
శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలు ఉన్నట్టు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తిరిగి బిగించినప్పుడు వాటి బరువు 38.258 గ్రాములుగా ఉంది. ఈ వ్యవహారంలో అనేక లోపాలున్నట్టు గుర్చించిన హైకోర్టు దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. విజిలెన్స్, యాంటీ కరప్షన్ బ్యూరో (వీఏసీబీ) దీనిపై ప్రాథమిక విచారణ ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి..
దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం
అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి